the United States
-
భగభగల సూరీడు.. ఇలా!
ఫొటో చూశారుగా... కుతకుత ఉడుకుతున్న సూరీడి ఉపరితలం ఛాయాచిత్రమిది. అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఏర్పాటైన సరికొత్త ‘ద ఐనోయీ సోలార్ టెలిస్కోపు’తో తీశారు. సూర్యుడి ఉపరితలం మొత్తం ఇలాగే ఉంటుందని.. కణాల్లాంటి భాగాలు అక్కడి చర్యల తీవ్రతకు ప్రతీకలని అంచనా. సూర్యుడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఈ టెలిస్కోపు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. సూర్యుడిపై జరిగే కార్యకలాపాలు భూ వాతావరణంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. సూర్యుడి ఉపరితలంపై సంభవించే పేలుళ్ల కారణంగా అయస్కాంత ధర్మం కలిగిన తుపానుల్లాంటివి చెలరేగుతుంటాయి. ఇవి కాస్తా భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై దుష్ప్రభావం చూపడంతోపాటు అవి పనిచేయకుండా చేసే చాన్సుంది. జీపీఎస్ వంటి వ్యవస్థలను నాశనం చేసేందుకు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలను దెబ్బతీసేందుకూ సౌర తుపానులు కారణమవుతాయని దీన్ని ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ ఫ్రాన్స్ కోర్డోవా తెలిపారు. సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీరుతెన్నులను ఐనోయీ టెలిస్కోపు వివరణాత్మకంగా తెలుసుకోగలదని, భవిష్యత్తులో సౌర తుపానులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని తెలిపారు. ప్రస్తుతం సౌర తుపానులు ఏర్పడేందుకు 48 నిమిషాల ముందు మాత్రమే మనకు తెలుస్తోంది. కొత్త టెలిస్కోపు సాయంతో 48 గంటల ముందుగానే తెలుసుకోవచ్చు. -
పసిడిపై ‘ఉత్తరకొరియా బాంబు’ మెరుపు
► అంతర్జాతీయ మార్కెట్లో 10 డాలర్లపైగా అప్ ► దేశీయంగా రూ.30,000 పైకి... న్యూయార్క్/ముంబై: ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు ప్రయో గం, అమెరికా హెచ్చరికలు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షితమైన సాధనంగా తిరిగి పసిడి వైపు చూడ్డం ప్రారంభించారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ నైమెక్స్‌లో సోమవారం ఒక దశలో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గత శుక్రవారం ముగింపుతో పోల్చితే 15 డాలర్లు పెరిగి 1344 డాలర్లకు చేరింది. కడపటి సమాచారం మేరకు 10 డాలర్లు ఎగసి 1340 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా రూ.355 అప్: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో... ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత పసిడి 10గ్రాముల ధర శుక్రవారం ముగింపుతో పోల్చితే, రూ.355 పెరిగి రూ.30,260కి చేరింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో పెరిగి రూ. 30,110కి ఎగసింది. వెండి కేజీ ధర రూ. 650 ఎగసి రూ. 40,645కు చేరింది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర గత వారంలో రూ.656 పెరిగ్గా, సోమవారం ధర కడపటి సమాచారం అందేసరికి రూ. 277 లాభంతో రూ. 30,100 వద్ద ట్రేడవుతోంది. -
కలసి సాగితే అద్భుతాలే..!
► ప్రపంచ శ్రేయస్సే భారత్, అమెరికా లక్ష్యం: మోదీ ► వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో వ్యాసం వాషింగ్టన్: ఉగ్రవాదం, అతివాద భావజాలం, భద్రతా ముప్పు నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకే భారత్ –అమెరికాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని, ప్రపంచ శ్రేయస్సే ఇరు దేశాల లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికకు వ్యాసం రాస్తూ.. భారత్, అమెరికాలు కలసికట్టుగా సాగితే ప్రపంచానికి అద్భుత ఫలితాలు అందుతాయని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు వివాదరహితమన్నారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు.. ‘ఊహించిన దాని కంటే భారత్, అమెరికాలు మరింత లోతైన, దృఢమైన భాగస్వామ్యం దిశగా సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో... ఆర్థిక వృద్ధి, మార్పు కోసం పరస్పరం సహకరించుకోవాలనే ఆసక్తితో ఇరు దేశాలున్నాయి. ఇరుదేశాల మధ్య కొనసాగిన అపనమ్మకాలు తొలగిపోయాయని గత జూన్‌లో వాషింగ్టన్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ఉభయ సభల్లో చెప్పాను. ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో ఏకాభిప్రాయం నెలకొంటున్న వేళ ఏడాది అనంతరం మళ్లీ అమెరికాకు వచ్చా. రెండు దేశాల మధ్య పటిష్టమైన ఉమ్మడి విలువలు, వ్యవస్థల్లో స్థిరత్వం వల్లే ఈ నమ్మకం సాధ్యమైంది. రాజకీయ విలువల పట్ల పరస్పర నమ్మకం, పరస్పర శ్రేయస్సు విషయంలో దృఢమైన విశ్వాసంతో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు సాధ్యమయ్యాయి. రక్షణలో పరస్పర ప్రయోజనాలే కీలకం ఎప్పుడైతే భారత్, అమెరికా కలసికట్టుగా సాగుతాయో.. ప్రపంచం మంచి ఫలితాలు పొందుతుంది. రోటా వైరస్, డెంగ్యూ, సైబర్ స్పేస్ నిబంధనలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో విపత్తు నివారణ, ఆఫ్రికాలో శాంతిదళాలకు శిక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. రక్షణ రంగంలో పరస్పర ప్రయోజనం మేరకు భారత్ అమెరికాలు ముందుకు సాగుతున్నాయి. ఇరు దేశాల్నే కాకుండా ఉగ్రవాదం, అతివాద భావజాలం నుంచి ప్రపంచాన్ని రక్షించడమే భారత్, అమెరికా ప్రథమ కర్తవ్యం. అఫ్గానిస్తాన్, పశ్చిమాసియా, ఇండో– పసిఫిక్ సముద్ర ప్రాంతం, సైబర్ స్పేస్ రంగంలో ప్రమాదాల్ని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం. జీఎస్టీ మంచి అవకాశం భారత్, అమెరికా మధ్య వార్షిక వాణిజ్యం విలువ 11,500 కోట్ల డాలర్లు దాటింది. అమెరికాలో ఉత్పత్తి, సేవా రంగాల్లో అనేక భారతీయ కంపెనీలు.. అమెరికాలోని 35 రాష్ట్రాల్లో మొత్తం 1,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అలాగే అమెరికన్ కంపెనీలు భారత్‌లో దాదాపు 2,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.. జీఎస్టీ ద్వారా భారత్ ఏకీకృత పన్ను వ్యవస్థగా మారనుంది. ఈ భారీ మార్పులు అమెరికా వ్యాపారవేత్తలకు విస్తారమైన వాణిజ్య, పెట్టుబడుల అవకాశాల్ని కల్పిస్తాయి. 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే వ్యవస్థల భారీ ఆధునికీకరణ, 2022 నాటికి అందరికీ గృహాకల్పన వంటివి కేవలం పట్టణ వ్యవస్థ ఆధునికీకరణకే కాకుండా.. ఇరుదేశాలకు భారీ ఉపాధి అవకాశాల్ని కల్పిస్తాయి. ఇరుదేశాల మధ్య డిజిటల్, శాస్త్ర రంగంలో సహకారం నెలకొనేందుకు.. నూతన సాంకేతికత, ఆవిష్కరణలు, నైపుణ్యమున్న ఉద్యోగులు సాయపడ్డారు. అమెరికాలోని 30 లక్షల మంది భారతీయ సమాజం ఇరుదేశాల క్షేమం కోసం పనిచేయడమే కాకుండా వారధిగా వ్యవరిస్తోంది. -
అమెరికాలో మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు
-
అమెరికాతో కటీఫ్.. చైనాతో దోస్తీ: ఫిలిప్పీన్స్
బీజింగ్: అమెరికాతో సుదీర్ఘకాల స్నేహానికి ఫుల్స్టాప్ పెట్టి చైనాతో చేతులు కలపనున్నట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే గురువారం వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రం (ఎస్సీఎస్)పై ఉన్న అభిప్రాయ భేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టిన ఈ ఇరు దేశాలు సముద్ర తీర రక్షణ సహకారంతో పాటు పలు అంశాల్లో 13 ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో చైనా భారీ దౌత్య విజయం సాధించినట్లయింది. గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్‌లో జరిగిన బిజినెస్ సమావేశంలో అమెరికా దోస్తీకి స్వస్తి పలుకుతున్నట్లు రోడ్రిగో ప్రకటించారు. -
బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్
-
బాబ్ డిలన్‌కు సాహిత్య నోబెల్
►అమెరికా సంగీత దిగ్గజాన్ని వరించిన విఖ్యాత పురస్కారం ► పులకించిన సంగీత ప్రపంచం అమెరికా సంగీత దిగ్గజం బాబ్ డిలన్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. జానపద గాయకునిగా, గీత రచయితగా పాపులర్ అయిన 75 ఏళ్ల బాబ్ డిలన్ ఈ విఖ్యాత అవార్డును అందుకున్న తొలి గీత రచయితగా చరిత్ర సృష్టించారు. డిలన్ అమెరికా గీత సంప్రదాయానికి కొత్త ఒరవడి నేర్పారని, కొత్త కవితాత్మక భావవ్యక్తీకరణలను ఆవిష్కరించారని, అందుకే ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేశామని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. డిలన్ రాసిన ‘బ్లోయింగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచింది. డిలన్‌కు ఈ అవార్డు రావడంతో సాహిత్య లోకం పులకించింది. కాగా, నోబెల్ పురస్కారాల ప్రదానం డిసెంబర్ 10న జరగనుంది. స్టాక్‌హోం: అమెరికా సంగీత దిగ్గజం, జానపద గాయకుడు, గీత రచయిత బాబ్ డిలన్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య అవార్డు వరించింది. 75 ఏళ్ల డిలన్ ఈ విఖ్యాత అవార్డును అందుకున్న తొలి గీత రచయితగా చరిత్ర సృష్టించారు. సాహిత్యం విభాగంలో సంగీతకారునికి, గీత రచయితకు అవార్డును ఇవ్వడం నోబెల్ అవార్డులను అనుసరించే వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరూ ఊహించని రీతిలో డిలన్ పేరును దీనిని ఎంపిక చేయడం నిపుణులను మరింత ఆశ్చర్యపరిచింది. డిలన్ అమెరికా గీత సంప్రదాయానికి కొత్త ఒరవడి నేర్పారని, కొత్త కవితాత్మక భావవ్యక్తీకరణలను ఆవిష్కరించారని, అందుకే ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేశామని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. జానపద గాయకుడైన డిలన్ పేరు చాలా ఏళ్లుగా నోబెల్ సాహిత్య పురస్కారం పోటీలో వినిపిస్తోంది. అయితే ఆయనను ఎవరూ ప్రధాన పోటీదారుగా భావించని తరుణంలో డిలన్ పేరును ప్రకటించగానే.. సభా ప్రాం గణం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆయన రాసిన ‘బ్లోరుుంగ్ ఇన్ ద విండ్’, ‘ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్’ పాటలు అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాలకు ఊపిరిగా నిలిచాయి. ఈ అవార్డు కింద డిలన్‌కు సుమారు రూ.6.06 కోట్లు అందనున్నాయి. మైమరిచిన సంగీత ప్రపంచం సంగీత దిగ్గజం బాబ్ డిలన్‌కు నోబెల్ పురస్కారం రావడంపై సంగీత ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది. సరోద్ విద్యాంసుడు అంజాద్ అలీఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, రచయిత సల్మాన్ రష్దీ తదితరులు డిలన్‌కు నోబెల్ రావడాన్ని స్వాగతించారు. సంగీత కళాకారులంతా గర్వించదగ్గ సందర్భం ఇది అని కొనియాడారు. తన పాటలతో తనను ప్రభావితం చేసిన వ్యక్తి డిలన్ అని, ప్రజలకు తన పాటలతో కొత్త లోకం చూపించిన వ్యక్తి ఆయనని ఏఆర్ రెహ్మాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. స్వీడిష్ అకాడమీ తీసుకున్న నిర్ణయం అద్భుతమని, దీని ద్వారా సాహిత్యంలో సంగీతం కూడా ఒక భాగం అనే విషయం రుజువైందని ప్రముఖ గీత రచయిత జావెద్ అక్తర్ పేర్కొన్నారు. గాయకులు అద్నాన్ సమి, ఉషా ఊతప్, విశాల్ దద్లానీ, శిల్పారావు, సోనా మహాపాత్ర, తదితరులు డిలాన్‌కు అభినందనలు తెలిపారు. డిసెంబర్ 10న ప్రదానం సాహిత్య అవార్డును ప్రకటించడంతో ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటనకు తెరపడినట్లయ్యింది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, శాంతి మొదలైన విభాగాలకు అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం ఈ అవార్డుల సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 10న నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 10న స్టాక్‌హోమ్ వేదికగా ఈ వేడుక జరగనుంది. శాంతి పురస్కార ప్రదానం కోసం అదే రోజు ఓస్లోలో నార్వేయన్ నోబెల్ కమిటీ మరో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా విజేతలకు నగదు పుస్కారం, గోల్డ్ మెడల్, డిప్లొమాను అందజేస్తారు. ప్రజలతో నడిచిన పాటగాడు.. ప్రఖ్యాత అమెరికన్ కవిగాయకుడు, జానపద సంస్కృతి ప్రేమికుడు హక్కుల ప్రోత్సాహకుడు బాబ్ డిలన్ (75). అమెరికా సంగీత దిగ్గజంగా గౌరవం అందుకునే బాబ్ డిలన్‌కు ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులున్నారు. ‘ది టైమ్స్ దే ఆర్ చేంజింగ్’, ‘అనదర్ సైడ్ ఆఫ్ బాబ్ డిలన్’, ‘బ్రింగింగ్ ఇట్ ఆల్ బ్యాక్ హోమ్’, ‘హైవే 61 రీవిజిటెడ్’ వంటి డిలన్ ఆల్బమ్స్ అమెరికాను ఉర్రూతలూగించాయి. అరిచి అరిచి పాడు.. డిలన్ అసలు పేరు రాబర్ట్ అలెన్ జిబర్మేన్. అమెరికాలోని మిన్నెసొటాలో 1941లో జన్మిం చాడు. సంగీతవాసనలు ఏ మాత్రంలేని కుటుం బంలో పుట్టినా.. రేడియో వింటూ ‘ఎల్విస్ ప్రెస్లీ’ ప్రభావంతో డిలన్ సంగీత ప్రపంచంలో అడుగు పెట్టాడు. హైస్కూల్లో ఉన్నప్పుడే సొంత బ్యాం డ్ ఏర్పాటు చేసుకుని స్కూల్ వేదికపై డిలన్ పాడుతుంటే ఆ సంగీత ధోరణికి, అరుపులకు కంగారుపడిన ప్రిన్సిపల్ మైక్ కట్ చేయాల్సి వచ్చిందట. డిలన్‌కు కవిత్వం అంటే ఇష్టం. ‘డిలన్ థామస్’ అనే కవి రాసిన కవిత్వాన్ని ఇష్టపడి తన పేరును ఆ కవి గుర్తుగా ‘బాబ్ డిలన్’ అని మార్చుకున్నాడు. పౌర హక్కుల గొంతుకై...: డిలన్‌ను అతడి సంగీతం కంటే అతడి సామాజిక బాధ్యతే ఎక్కువమందిని చేరువ చేసింది. 1960లలో అమెరికా అంతటా భగ్గున ఎగసిన పౌర హక్కుల ఉద్యమంలో బాబ్ డిలన్ ప్రత్యేక ఆకర్షణ. విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో నల్లవాళ్లపై అమెరికాలో బయటపడ్డ వివక్ష పట్ల బాబ్ డిలన్ గళమెత్తాడు. హక్కులకోసం పోరాడుతున్న వారందరికీ.. డిలన్ రాసిన పాటలు మరింత ఊపునిచ్చాయి. అలాగే వియత్నాంతో అమెరికా చేస్తున్న యుద్ధాన్ని కూడా గట్టిగా వ్యతిరేకిస్తూ ‘యాంటి వార్ ఉద్యమం’తో పాటుగా నడిచాడు. సమర్థమైన, భావరసస్ఫోరకమైన, చైతన్యపరిచే గీతాలను ఆలపించే డిలన్.. తనకొస్తున్న పాపులారిటీ, వెంట పడుతున్న జనం నుంచి తప్పించుకోవడానికి మోటర్ సైకిల్ ప్రమాదం మిషతో 1966 నుంచి 8ఏళ్లపాటు జనానికి దూరంగా ఉన్నాడు. తర్వాత 1980 నుంచి కొనసాగిస్తున మ్యూజికల్ టూర్ అమెరికా సంగీత చరిత్రలో సుదీర్ఘమైన టూర్‌గా ప్రత్యేకత సంపాదించుకుంది. చిత్రకారుడుగా కూడా డిలన్ ఆరు పుస్తకాలను తన బొమ్మలతో ప్రచురించాడు. పాట రచనతో అతడు ఏర్పరిచిన ప్రభావానికి 2008లో పులిట్జర్ పురస్కార కమిటీ ఒక ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసింది. లెక్కలేనన్ని అవార్డులు పొందిన డిలన్ పాటలు అన్ని కలిపి మొత్తంగా పదికోట్ల కాపీలు అమ్ముడు పోయాయి. ధోరణి మార్చుకుంటున్న అవార్డు కమిటీ.. నోబెల్ సాహిత్య పురస్కారం సాధారణంగా కవిత్వం, కథ, నవల, నాటకం ఇలాంటి సాహితీ ధోరణుల్లో ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఇటీవల అవార్డు కమిటీ తన పరిధిని విస్తరించుకుంటోంది. 2014లో అవార్డ్ పొందిన ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మొడియానో పెద్ద గొప్ప రచయిత కాదు. కానీ.. రెండో ప్రపంచయుద్ధంలో జర్మన్లు ఫ్రాన్స్ ఆక్రమణపై రాసిన కథలకు ఈ అవార్డు ప్రకటించారు. 2015లో స్వెత్లానా అలెక్సివిచ్ అనే జర్నలిస్టుకు (సోవియట్ పతనం తర్వాత పరిణామాలను ఇంటర్వ్యూల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు) నోబెల్ దక్కింది.ఈ సంవత్సరం అనూహ్యంగా ఈ కవిగాయకుడికి ప్రకటించారు. - మొహమ్మద్ ఖదీర్ బాబు కాఫీ హోటళ్ల నుంచి.. గొప్పవారి కథనాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. బాబ్ డిలన్ కథ కూడా అలాంటిదే. అతడు కూడా గిటార్ పట్టిన వెంటనే సూపర్‌స్టార్ అయిపోలేదు. అంచెలంచెలుగా ఎదిగాడు. కాఫీ హోటళ్లలో, స్థానిక క్లబుల్లో పాడుతూ క్రమంగా నలుగురికీ పరిచయమయ్యాడు. జానపదానికి ప్రాధాన్యమివ్వటంతో అందరినీ ఆకర్శించాడు. ‘ఫోక్ సింగింగ్’ నుంచి ‘రాక్ అండ్ రోల్’కు తన ధోరణి మార్చుకోవడానికి డిలన్ చాలా కాలమే తీసుకున్నాడు. -
తెలంగాణకు పెట్టుబడులతో రండి
పారిశ్రామికవేత్తలకు మంత్రి జూపల్లి పిలుపు ‘వైబ్రంట్ గుజరాత్’లో తెలంగాణ స్టాల్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలుచేస్తున్నతెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల తో రావలసిందిగా జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని మహాత్మామందిర్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ప్రారంభమైన ‘7వ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్’ కార్యక్ర మానికి సోమవారం హాజరైన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ పరిశ్రమల స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులకు భద్రతను కల్పించడంతో పాటు ఆకర్షణీయమైన లాభాలకు అనువుగా ఉండే పారిశ్రామిక విధానం ఉందన్నారు. స్పెషల్ చేజింగ్ సెల్ ద్వారా ఒక్క దరఖాస్తుతో పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులిచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ నాయకత్వం కూడా పెట్టుబడుదారులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌తో పాటు దేశంలోని పారిశ్రామికవేత్తలు, అమెరికా, ఇజ్రాయిల్, చైనా, సింగపూర్, స్వీడన్, జపాన్ తదితర దేశాల ప్రతి నిధులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం గుజరాత్లో జరుగుతున్న సమ్మిట్‌లో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని ప్రముఖ పరిశ్రమలైన కల్పతరు ట్రాన్స్మిషన్ కంపెనీ, సహజానంద లేజర్ టెక్నాలజీస్‌ను సందర్శించి ఆయా పరిశ్రమల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కాగా సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపిన పారిశ్రామిక వేత్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి వెంట ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఫ్యాప్సీ, ఇతర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. -
చారిట్రీట్
విలాసవంతమైన పరిసరాలు..వీనుల విందైన సంగీతం.. చవులూరించే దేశ విదేశీ వంటకాలు.. వెచ్చగా ఆహ్వానించే విదేశీ పానీయాలు.. తిన్నంత తిని, తాగినంత తాగి.. అతిరథ మహారథులైన ప్రముఖులతో ముచ్చటించి.. కొన్ని గంటలపాటు హాయిగా గడిపేయడం..ఈ లక్షణాలు సిటీలోని పేజ్ త్రీ పార్టీలవి. ఇప్పుడు ఇదే లక్షణాలతో వచ్చిన మరొక సందడి నగరవాసుల్ని ఆకట్టుకుంటోంది. ఎందుకంటే దీని ద్వారా ఆహ్లాదకరమైన అనుభవంతో పాటు అవసరార్థులకు చేయూత అందించామన్న సంతోషంఅదనంగా లభించడమే ఇందుకు కారణం. వెస్ట్రన్ కంట్రీస్‌లో బాగా పాపులరైన చారిటీ విందు.. సిటీలోకి అడుగుపెట్టింది. సరికొత్త పార్టీయింగ్ కల్చర్‌కు తెర తీసింది. ..:: ఎస్.సత్యబాబు అమెరికా, బ్రిటన్.. యురోపియన్ దేశాల్లో చారిటీ డిన్నర్లు సర్వసాధారణం. అక్కడి సంపన్నులు, భోజనప్రియులు తమ సరదాలను కానిస్తూనే.. చక్కని పరమార్థాన్ని వాటికి జోడిస్తుంటారు. తద్వారా పార్టీలు, కాస్ట్లీ హ్యాపెనింగ్స్.. వంటివి కేవలం రిచ్సర్కిల్ తమ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి మాత్రమే అనే సామాజిక అపోహను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. సిటీలో ఎంట్రీ వెనుక... సిటీలోనూ రిచ్పీపుల్ నానాటికీ పెరుగుతుండ టం, రోజుకో రకమైన పార్టీలు ఊపందుకోవడం తెలిసిందే. ఇలాంటి కల్చర్‌ని అనుసరించేవారితో పాటు విమర్శించే వారూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వెస్ట్రన్ స్టైల్ ఈవెంట్ రంగప్రవేశం చేసింది. వైన్ అండ్ డైన్ పార్టీలకు చక్కని మానవీయ కోణాన్ని అద్దింది. ‘నాలుగేళ్ల కిందట తొలిసారి మేం నగరంలో చారిటీ డిన్నర్ నిర్వహించాం. జాయ్ ఫుల్ డైనింగ్ని హెల్ప్‌ఫుల్ ఈవెంట్‌గా మలచడం అనే కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంది’ అని తరచుగా చారిటీ డైనింగ్ ఈవెంట్స్ నిర్వహించే ప్రియ మదోక్ వర్మ చెప్పారు. అయితే ఇవి కేవలం డిన్నర్లకే పరిమితం కావడం లేదు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఏదో ఒక సమయాన్ని తీసుకుని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు గత వాలంటైన్స్ డే రోజున జూబ్లీహిల్స్‌లోని బోంబే డెక్ డైనింగ్ కంపెనీలో జరిగిన లంచ్ పార్టీ, ఏప్రిల్ లో రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన బ్రంచ్, అక్టోబర్‌లో క్లబ్‌హౌస్‌లోని ట్రెండ్‌సెట్ వింజ్లో ఏర్పాటు చేసిన పాట్లాక్ లంచ్ వంటివన్నీ ఈ కోవలోనివే. పార్టీస్‌కి గ్లోబల్ లుక్.. నగరంలో విదేశీయులు పెద్దసంఖ్యలో నివసిస్తుండటం కూడా ఈ చారిటీ పార్టీలకు ఊపునిస్తోంది. ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీయులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వెస్ట్రన్ కల్చర్‌కు బాగా దగ్గరగా ఉండే వారిని ఆకర్షించి, పార్టీకి గ్లోబల్ లుక్ తేవడానికి మంచి మార్గంగా ఉపయోగపడుతున్నాయి. తద్వారా పేజ్ త్రీ పార్టీలకు తమకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనబరుస్తున్నాయి. రూ.5 వేలు ఆ పైన ధరలో ఎంట్రీకి అవకాశం కల్పించే ఈ చారిటీ డిన్నర్స్ని స్టార్ హోటల్స్ లేదా రిచ్ రెస్టారెంట్స్, లాంజ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రసిద్ధ రాక్ బ్యాండ్ లైవ్ మ్యూజిక్, టాప్ క్లాస్ చెఫ్‌లు వండి వడ్డించే కాస్మొపాలిటన్ రుచులు, విదేశీ వైన్ వంటివి అతిథులను ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఆక్షన్.. రియాక్షన్.. ఈ పార్టీస్‌లో డిన్నర్‌తో పాటు ఆక్షన్ కూడా ఉంటుంది. అయితే ఇదంతా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వంటి అరుపులు కేకలు లేకుండా సెలైంట్‌గా సాగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు చారిటీ కోసం ప్రత్యేకంగా పంపించినవి అక్కడ ప్రదర్శిస్తారు. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలు, నటీనటులు, క్రీడాకారుల సంతకాలతో టీషర్ట్స్, బుక్స్.. ఇంకా అనేకం అక్కడ కొలువుదీరుతాయి. కనీస ధర ఎంత అనే తెలియజేసే స్టిక్కర్ సదరు చిత్రం లేదా వస్తువు మీద అతికిస్తారు. ఆ ధరకు పైన తాను ఎంత వరకూ కొనాలనుకుంటున్నాడో అతిథి పక్కనే ఉన్న ఒక పేపర్ మీద రాసి, తన పేరు, ఫోన్ నంబర్ వేయాలి. అలా ఒకరు ఎన్నింటి మీదైనా, ఎన్నిసార్లయినా తాము వేలం పాడ దలచుకున్న ధరలు తెలియజేయవచ్చు. చివరగా అంటే పార్టీ పూర్తయ్యే సమయానికి అధిక మొత్తాన్ని కోట్ చేసిన వ్యక్తి ఆక్షన్‌లో గెలిచినట్టు. ఎంట్రీ టికెట్ ద్వారా వసూలైన ఆదాయంతో పాటు, మరింత వెచ్చించగలిగే స్థోమత ఉన్నవారి కోసం ఈ వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ‘మేం నిర్వహించిన చారిటీ డిన్నర్లో ఆహూతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ సైన్ చేసిన బ్యాట్, సల్మాన్ ఖాన్ ధరించిన టీ షర్ట్.. వంటివి కొనడానికి గెస్ట్స్ పోటీపడ్డారు. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని సిటీలోని పలు ఆర్ఫన్ హోమ్స్‌కు అందించాం’ అని అడ్వకేట్స్ బేబీస్ ఫర్ క్రైసిస్ సొసైటీ (ఏబీసీ) స్వచ్ఛంద సంస్థ కోసం గచ్చిబౌలిలోని హయత్ హోటల్లో నిర్వహించిన చారిటీ డిన్నర్ నిర్వాహకుల్లో ఒకరైన అనిత చెప్పారు. ఆనందించే సందర్భం అంటే అవసరార్థులకు చేయూతను అందించే మార్గం కూడా అనే చక్కని సందేశాన్ని అందిస్తున్న ఈ చారిటీ పార్టీ కల్చర్ రోజు రోజుకూ ఊపందుకోవడం అనేది నిరుపేదలకు మరింతగా మేలు చేసేదేనడంలో సందేహం లేదు. స్పందన బాగుంది... ఆహ్లాదకరమైన పరిసరాలు, విందు, వినోదాలు, చక్కని సంగీతాన్ని మనం ఎంజాయ్ చేస్తూనే నిరుపేదలకు సాయం చేసే అవకాశాన్ని ఈ తరహా పార్టీలు అందిస్తాయి. కొంతకాలంగా మా ఏబీసీ చారిటీ ఆర్గనైజేషన్ తరపున సిటీలోని రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్‌లో ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. నగరవాసుల స్పందన బాగుంది. వీటి ద్వారా సేకరించిన నిధులను అవసరార్ధులకు వినియోగిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇదొక ట్రెడషన్గా మారితే... మరింత మంది నిరుపేదలకు మేలు కలుగుతుంది. -ప్రియా మధోక్ వర్మ, ఏబీసీ సంస్థ ప్రతినిధి -
స్కూల్‌కు టైమ్‌కు వెళ్లాలా.. ఈ బస్సెక్కండి..
ఇదో స్కూల్ బస్సు.. పేరు ‘స్కూల్ టైం’. ఇదెక్కితే స్కూల్‌కు ఆలస్యమవడం వంటివి ఉండవు. దీని అత్యధిక వేగం గంటకు 590 కిలోమీటర్లు మరి! అమెరికాలో ఇండియాకు చెందిన ఇంజనీర్ పాల్ స్టెండర్ దీన్ని తయారు చేశారు. దీని వేగానికి కారణం.. జెట్ ఇంజిన్. చూశారుగా ఎలా నిప్పులు కక్కుతుందో.. అదే సమయంలో డీజిల్ బాగా తాగేస్తుంది.. ప్రస్తుతం ఈ బస్సు అమెరికా అంతటా పర్యటిస్తూ.. అందరినీ ఆకర్షిస్తోంది. -
బంగారు కృష్ణయ్య
పేద ఇంట్లో పుట్టి ప్రొఫెసర్‌గా ఎదిగిన కృష్ణయ్య పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్న వైనం ఉస్మానియా యూనివర్సిటీ: పట్టుదల...క్రమశిక్షణ... ఈ రెండింటి కలబోతే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణయ్య. మహబుబ్‌నగర్ జిల్లా మాడుగుల మండలంలోని దిల్వార్ ఖాన్పల్లిలోనినిరుపేద దళిత కుటుంబానికి చెందిన అరెకంటి లక్ష్మయ్య, నర్సమ్మ దంపతుల కుమారుడు కృష్ణయ్య. చిన్ననాటి నుంచి చదువంటే ఆసక్తి కనబరిచే ఆయన అనేక కష్టనష్టాలకు ఓర్చి ఉన్నత విద్యను అభ్యసించారు. హాస్టళ్లలో ఉంటూ... ఉపకార వేతనాలు...మిత్రుల సాయంతో చదువు సాగించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించారు. పీహెచ్‌డీలో గోల్డ్ మెడల్ ప్రొఫెసర్ కృష్ణయ్య ఓయూలో విధులు నిర్వహిస్తూనే ఐఐటీ చెన్నైలో పీహెచ్డీ పూర్తి చేశారు. తన పరిశోధనకు బంగారు పతకం అందుకున్నారు. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుల్లో పీహెచ్‌డీలో బంగారు పతకం సాధించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అనంతరం పోస్టు డాక్టరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్)ను దక్షిణ కొరియాలో పూర్తి చేశారు. సుమారు 17 ఏళ్ల బోధన అనుభవం గల ఆయన రూ.32 లక్షలతో మూడు యూజీసీ, ఏఐసీటీఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. తొమ్మిది దేశాల్లో పర్యటన.. ఓయూ అధ్యాపకునిగా పని చేస్తున్న కృష్ణయ్య 25 పరిశోధన పత్రాలను సమర్పించారు. అందులో 15 అంతర్జాతీయ, పది జాతీయ స్థాయి పేపర్లు ఉన్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, చైనా, థాయ్‌లాండ్, కొరియా, సింగపూర్లలో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను సమర్పించారు. బోధన, పరిశోధనలో ప్రతిభకు సుదర్శన్ భట్ మెమోరియల్ అవార్డు అందుకున్నారు. ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)లో రెండు పర్యాయాలు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌తో పాటు, ఇతర పదవులు చేపట్టిన ఆయనప్రస్తుతం అడిషనల్ కంట్రోలర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు తన స్వగ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. కష్టపడి చదవితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పే కృష్ణయ్య జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. స్నేహితుల సహకారంతోనే పేద కుటుంబం కావడంతో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి చదువుకున్నాను. ఓయూకు ప్రొఫెసర్‌ను అవుతానని కలలోనైనా అనుకోలేదు. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. స్కాలర్షిప్లు, స్నేహితుల ఆర్థిక సహకారంతో చదువుల బండి సాగింది. అమనగల్లు, బీచ్పల్లిలో పది వరకు చదివా. కోఠిలో గల (నేడు బీఎన్ రెడ్డిలో) చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశా. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ చ6దువుతూ ఎంసెట్‌కు హాజరయ్యాను. ఓయూ క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో సీటు సాధించాను. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ప్రాజెక్టులో పని చేస్తుండగానే 1997లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించింది. దీంతో ఉన్నత విద్య పై మరింత ఆసక్తి కలిగింది. 2012లో ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. - ప్రొఫెసర్ కృష్ణయ్య -
విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాల ఏర్పాటుకు తీర్మానం
ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ : తెలుగును ప్రపంచ భాషగా గుర్తించాలని, విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు చేయాలని కోరుతూ యూకే (యునెటైడ్ కింగ్డమ్) తెలుగు సంఘం సభల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. ఆయన స్థానిక తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్, అమెరికాలో పర్యటిం చిన తాను, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో చర్చించినట్లు చెప్పారు. గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి ప్రపంచ భాషగా తెలుగును గుర్తించి, గూగుల్‌లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించినా సంస్థ ప్రతినిధులు మరుసటి రోజే గూగుల్‌లో తెలుగుకు స్థానం కల్పించారని, ప్రత్యేక తెలుగు పాంట్లు రూపొందించారని వివరించారు. ప్రపంచ విద్యావ్యవస్థలో తెలుగుకు రెండో భాషగా ప్రాముఖ్యత కల్పించడానికి తాముచేసిన కృషి సత్ఫాలితలనిచ్చే దిశగా సాగుతోందన్నారు. గత నెల 26, 27 తేదీల్లో జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో ప్రపంచ భాషగా తెలుగుకు గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. విదేశీయులు సైతం తెలుగు అభ్యసించటానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. జన్మభూమిపై ప్రవాసాంధ్రుల ఆసక్తి రాష్ట్రంలో అమలుచేస్తున్న జన్మభూమి కార్యక్రమంపై ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపుతున్నారని బుద్ధప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో వారు జన్మించిన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలో సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే తుపాను నష్టంపై ప్రాథమిక సమాచారం అందించటంతో స్పందించిన అమెరికాలోని తెలుగువారు విరాళాలు ప్రకటించారని బుద్ధప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేయటానికి వారికి సహకారం అందించటానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రవాసాంధ్రులు ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు. -
‘ఐఎస్’ అంతానికి సాయం
పారిస్: ‘ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)’ మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇరాక్‌కు సైన్య సహకారం సహా అన్ని విధాలా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజం నిర్ణయించింది. అమెరికా, రష్యా, చైనా సహా 30 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సోమవారం పారిస్‌లో సమావేశమై.. ఐఎస్ ఆగడాలపై చర్చించారు. ఇటీవల బ్రిటన్ పౌరుణ్ణి ఐఎస్ మిలిటెంట్లు చంపిన నేపథ్యంలో.. ఇరాక్ నుంచి ఐఎస్ దళాలను తరిమికొట్టే ప్రక్రియను మరింత వేగం చేయాలని నిర్ణయించారు. ‘ఇరాక్ కోరిన విధంగా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అవసరమైన సైన్య సహకారాన్ని అందించాల’ని తీర్మానించారు. అయితే, భేటీ అనంతరం విడుదల చేసిన తీర్మాన పత్రంలో ఐఎస్ మిలిటెంట్లు ప్రబలంగా ఉన్న సిరియా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. సమావేశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రారంభించారు. సత్వరమే ‘ఐఎస్’ను అంతం చేయకపోతే అది మరిన్ని దేశాలకు చేరే ప్రమాదముందని ఇరాక్ అధ్యక్షుడు మాసుమ్ హెచ్చరించారు. ఐఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న అంతర్జాతీయ కూటమిలో చేరేందుకు ఇరాన్ నిరాకరించింది. ఆ కూటమికి విశ్వసనీయత లేదని ఇరాన్ అత్యున్నత నేత, షియాల మతపెద్ద అయిన అలీ ఖొమేనీ స్పష్టం చేశారు. ఐఎస్‌పై సైనిక చర్య చేపట్టాల్సిందేనని నాటో సెక్రటరీ జనరల్ రస్ముసన్ తేల్చి చెప్పారు. -
సెప్టెంబర్ 11 స్మారక మ్యూజియం ఏర్పాటు
సందర్భం డబ్ల్యూటీసీపై దాడికి 13 సంవత్సరాలు సాధారణంగా చరిత్రలో అనేక సంఘటనలు జరుగుతాయి. అవి కొంతకాలం గడిచాక కాలగర్భంలో కలసి పోతాయి. కానీ సెప్టెంబర్ 11 సంఘటనను అమెరికా పాలకులు మరచిపోలేదు. డబ్ల్యూటీసీని ఉగ్రవాదులు కూల్చి వేసిన ప్రాంతంలోనే 1,10,000 అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్థుల భవనంగా స్మారక మ్యూజియమ్‌ను నిర్మించారు. ఇలాంటి మ్యూజియం నిర్మించడం ప్రపంచంలోనే ప్రథమం. మ్యూజియం ఏర్పాటుకు నిపుణుల సలహాలు.... మ్యూజియం ఏర్పాటుకు అమెరికా ప్రభుత్వం పెద్ద కసరత్తునే నిర్వహించింది. మ్యూజియంను ఎలా నిర్మించాలనే విషయంలో సామాజిక శాస్త్ర వేత్తలు, జర్నలిస్టులు, పత్రికా సంపాదకులు, వాణిజ్య వేత్తలు ఇతర నిపుణుల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించారు. అమెరికాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వేలాది సూచనలు వచ్చాయి. వాటిలో నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకున్నారు. చివరకు అన్ని హంగులతో మ్యూజియంను నిర్మించారు. ప్రపంచ ఉగ్రవాదం గురించి అధ్యయనం చేసేందుకు ఇదొక పరిశోధన కేంద్రంగా ఉపయోగపడే విధంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ ఘోర సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన వేయి మంది బాధితులు అనుభవించిన బాధను, ఆక్రోశాన్ని రికార్డు చేశారు. సందర్శకులు తమ అభిప్రాయాన్ని రికార్డు చేసేందుకు మ్యూజియంలో ప్రత్యేకంగా స్టూడియోను ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని కుదిపేసిన సెప్టెంబర్ 11 సంఘటన తాలూకు అనుభవాలను, శిథిలాలను, మృతుల చిత్రాలతో కూడిన చేదు జ్ఞాపకాలను ఇక్కడ పదిలం చేశారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారిలో అనేక మంది భారతీయులు కూడా ఉన్నారు. మరణించిన వారి పేర్లను గ్రౌండ్ జీరో వద్ద నిర్మించిన రెండు స్మారక చిహ్నాలపై రాశారు. సెప్టెంబర్ 11న అమెరికా ప్రభుత్వం సేవా దినంగా ప్రకటించింది. ఈ రోజున మ్యూజియంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదంపై నిరంతర యుద్ధం చేస్తామని, ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమని తాము దృఢంగా నమ్ముతున్నామని మ్యూజియం డెరైక్టర్ అలైస్ ఎం గ్రీన్వాల్డ్ తమ సందేశంలో పేర్కొన్నారు. - న్యూయార్క్ నుంచి జి. గంగాధర్ (సిర్ప) -
ఎత్తు లేకున్నా... ఎంతో ఎత్తుకు..!
కనీసం నాలుగు అడుగులు దాటని ఎత్తు... వయసేమో రెండు పదులు... ప్రతిభ ఉన్నా కాలంతో పోటీపడదామంటే ప్రోత్సాహం కరువు... గుర్తించే వాళ్లు అంతకన్నా లేరు... ఇవీ మరుగుజ్జుల కష్టాలు... అలాగని వాళ్లు మనో ధైర్యాన్ని వీడలేదు... క్రీడల్లో తమకున్న నైపుణ్యానికి మరింత పదును పెట్టారు... మంచి ఫలితాలు సాధించారు... తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మరుగుజ్జులంటే అందరికీ చిన్నచూపే... సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు... ప్రతిభ ఉన్నా బండెడు కష్టాలే... అందుకే వాళ్లు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లతోనో... సర్కస్‌లో జోకర్లుగానో... చిరు వ్యాపారులుగానో స్థిరపడిపోతున్నారు. ఇవేమీ లేనివాళ్లు బతుకు బండిని భారంగా లాగిస్తున్నారు. అయితే సమాజంలో తమకూ ఏదో విధమైన గుర్తింపు దక్కాలన్న ఆశయం వారిని క్రీడాకారుల్ని చేసింది. తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించేలా చేసింది. ఫలితంగా మరుగుజ్జులు డ్వార్ఫ్ క్రీడల్లో, పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్నారు. ఇంతింతై... మరుగుజ్జు క్రీడాకారుల కోసం అమెరికాలో డ్వార్ఫ్ అథ్లెటిక్ అసోసియేషన్ 1985లో ఏర్పాటైంది. మరుగుజ్జు క్రీడలను అభివృద్ధి చేసి, వాటికి ప్రాచుర్యం కల్పించి, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ సంఘం ఏర్పడింది. అలా తామూ ఏ క్రీడలనైనా ఆడగలమనే ధీమాను సాధించడమే కాకుండా మరుగుజ్జులకు పోటీలూ ఉన్నాయని ప్రపంచానికి చాటినట్లయింది. అలా మొదలైన వారి ప్రస్థానం ప్రపంచ క్రీడల్లో ప్రత్యేకంగా కొనసాగుతోంది. మరుగుజ్జులకు ప్రత్యేకం అథ్లెటిక్స్... ఫుట్‌బాల్... బాస్కెట్‌బాల్... స్విమ్మింగ్... బ్యాడ్మింటన్... ఫ్లోర్ హాకీ... వాలీబాల్... ఆర్చరీ.. టెన్నిస్... పవర్‌లిఫ్టింగ్... షూటింగ్... కర్లింగ్... ఇలా పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉండి.. క్రీడాకారుడిగా సత్తా చాటాలనుకునే మరుగుజ్జుల కోసం ప్రతీ నాలుగేళ్లకోసారి ప్రపంచ క్రీడలు జరుగుతాయి. ఇప్పటిదాకా ఆరుసార్లు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడలు జరగ్గా... చివరిసారిగా 2013లో అమెరికాలోని మిచిగాన్ ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. 2013 ప్రపంచ క్రీడల్లో 17 దేశాలకు చెందిన 395 మంది మరుగుజ్జులు పోటీల్లో పాల్గొన్నారు. 1993లో తొలిసారిగా ఈ పోటీలకు అమెరికాలోని చికాగో ఇల్లినాయిస్లో నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేది వీరే మరుగుజ్జుల పోటీల్లో పాల్గొనాలనుకునే వారి ఎత్తు నాలుగు అడుగుల పది అంగుళాలు మించకూడదు. కండరాలు అసాధారణంగా పెరగడం వల్ల కాళ్లు, చేతుల్లో వాపు వచ్చిన వారిని ఇందులో పాల్గొనేందుకు అనుమతినిస్తారు. అయితే ఈ పోటీల్లో పాల్గొనే వాళ్లంతా మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక డ్వార్ఫ్ క్రీడలు ఎక్కడ జరిగినా నిబంధనలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఈ క్రీడల్లో పాల్గొనే వాళ్లు పారా ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతుంటారు. అందుకే మరుగుజ్జులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఈ క్రీడల్లో పాల్గొనే వారికి ఫ్యూచర్స్, జూనియర్స్, ఓపెన్, మాస్టర్స్ వయస్సు గ్రూపుల్లో పోటీలు నిర్వహిస్తారు. వీరికి అత్యున్నత క్రీడలు ఒకరకంగా ప్రపంచ డార్ఫ్ గేమ్సే. మరుగుజ్జు క్రీడాకారులు ఏ దేశానికి చెందిన వారైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. తమ దేశానికి చెందిన చెఫ్ డి మిషన్ ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ చీఫ్ డి మిషన్ లేకపోతే పోటీల్లో పాల్గొనేందుకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మనకూ ఉన్నారు... మరుగుజ్జు క్రీడల్లో మనవాళ్లూ తక్కువేమీ తినలేదు. భారత్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొనేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు అంతర్జాతీయ వేదికల్లో రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లో పతకాల పంట పండించారు. 9 బంగారు పతకాలతో సహా మొత్తం 18 పతకాలు సాధించి భారత్‌ను ఆరో స్థానంలో నిలిపారు. 16 మంది పోటీల్లో పాల్గొనగా.. జోబీ మాథ్యూ, రాజన్న, ప్రకాశ్, ఆకాశ్ మాధవన్, నళిని, రేణు కుమార్‌లు తమ సత్తా చాటి పలు విభాగాల్లో పతకాలు సాధించారు. ఆల్‌రౌండర్ జోబి కేరళకు చెందిన 38 ఏళ్ల మరుగుజ్జు జోబీ మాథ్యూ అర్మ్ రెజ్లర్‌గా అందరికీ సుపరిచితమే. ప్రాక్సిమల్ ఫెమోరల్ ఫోకల్ డెఫీషియన్సీ (పీఎఫ్‌ఎఫ్‌డీ) కారణంగా జోబి 60 శాతం వైకల్యంతో పుట్టాడు. పీఎఫ్‌ఎఫ్‌డీ వల్ల జోబి కాళ్లలో ఏమాత్రం ఎదుగుల లేకపోయినా.. మిగిలిన శరీరం మొత్తం వయసుకు తగ్గట్లుగానే పెరిగింది. మూడు అడుగుల ఐదు అంగుళాల పొడవున్న ఈ కేరళ మరుగుజ్జు తాను ఎత్తు పెరగలేకపోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. కాళ్లు సహకరించకపోయినా.. మిగిలిన శరీరంలో అందరి లాగే పెరుగుదల ఉండటంతో జిమ్‌కి వెళ్లి తీవ్రంగా సాధన చేశాడు. అందుకు జోబికి తగిన ఫలితం దక్కింది. బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్‌లో సత్తా చాటాడు. స్పెయిన్‌లో జరిగిన 29వ ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లోనూ దుమ్ము రేపాడు. అథ్లెటిక్స్ క్లాస్ 3లో షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావిలిన్ త్రో తోపాటు సీనియర్ క్లాస్ 1 బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. ఇక జోబి జనరల్ కేటగిరీలోనూ, వైకల్య విభాగంలోనూ రెజ్లింగ్, ఫెన్సింగ్, బాడీ బిల్డింగ్‌లో చాలా సార్లు సత్తా చాటి ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు. -
అమెరికన్ పార్సిల్లో పిచ్చికాగితాలు !
ఐ-ఫోన్‌కు బదులు ఖాళీ పెట్టె జగ్గయ్యపేట : అమెరికా నుంచి వచ్చిన ఒక రిజిస్టర్ ఎయిర్ మెయిల్ పార్సిల్లో ఐ ఫోన్‌కు బదులు పిచ్చి కాగితాలు వచ్చిన సంఘటన పేట పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకోవడంతో బాధితుడు ఆరో వార్డు కౌన్సిలర్ ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) అవాక్కయ్యారు. వివరాలలోకి వెళితే చిన్నా బంధువు అమెరికాలో ఉంటున్నారు. గతనెల 23న బంధువు కట్టా శ్రీనివాసరావు రూ.60 వేలు విలువ కలిగిన ఐ ఫోన్ (ఎఫ్-5) ను అమెరికా నుంచి జగ్గయ్యపేటకు రిజిస్టర్ ఎయిర్‌మెయిల్ ద్వారా చిన్నాకు పంపారు. గురువారం రాత్రి జగ్గయ్యపేట పోస్టాఫీసు ద్వారా పార్సిల్ చిన్నా ఇంటికి వచ్చింది. దాన్ని తెరచి ఓపెన్ చేసి చూడగా అందులో ఫోన్‌కు బదులుగా పోన్బాక్సులో పిచ్చి కాగితాలు ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే బంధువుకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని పేట సబ్ పోస్టు మాస్టర్‌కు తెలియజేసి, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా ఫోన్ మిస్సింగ్ పోస్టాఫీసులో జరిగిందా లేక కస్టమ్స్ అధికారుల వైఫల్యమా తేలాల్సి ఉంది. -
భౌగోళిక అద్భుతం నయాగరా...
విదేశాలలో! ప్రపంచంలోనే భౌగోళికంగా ప్రసిద్ధి చెందిన నయాగరా జలపాతం కెనడా, అమెరికా దేశాల సరిహద్దులో ఉంది. 167 అడుగుల ఎత్తు నుంచి జలపాతం కొండపై నుంచి కిందికి పడుతుండే దశ్యం మనోహరం. న్యూయార్క్ రాష్ర్టంలోని బఫెల్లో పట్టణానికి సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లను చేసింది. ఒకే సమయం లో కెనడా, అమెరికా దేశాల ప్రజలు, టూరిస్టులు సందర్శించేందుకు భారీ ఏర్పాట్లున్నాయి. కెనడాలోని హార్షూ జలపాతం, నయాగరా జలపాతం పక్క పక్కనే ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో హార్షూ జలపాతం కంటె నయాగరానే పెద్దది. నయాగర జలపాతాన్ని అతి సమీపం నుంచి పడవలోనూ, సొరంగమార్గం ద్వారా సందర్శించవచ్చు. పడవలో 17 డాలర్లు, సొరంగమార్గంలో వెళ్లేందుకు 12 డాలర్లు చెల్లించాలి. నయాగరాను సందర్శించేందుకు మెయిడ్ మిస్త్ నుంచి కిందికి లిఫ్ట్‌లో వెళ్లాలి. పడవలోకి వెళ్లే ముందు సందర్శకులకు రెయిన్‌కోట్ ఇస్తారు. పడవ కెనడాలోని హార్స్‌షూ జలపాతం దగ్గరగా వెళుతుంది. అ సమయంలో పై నుంచి దుముకుతున్న జలపాతాన్ని అతి సమీపం నుంచి తిలకించడం జీవితంలో మరపురాని అనుభూతిగా మిగులుతుంది. అక్కడ నుంచి పడవ నయాగరా జలపాతం వైపు మళ్లుతుంది. అక్కడ సాయంత్రం సూర్యకిరణాలు పడడం వల్ల ఇంధ్రదనుస్సు సందర్శకులకు కనువిందు చేస్తుంది. కెనడా వైపు నుంచి వచ్చే సందర్శకులకు ఎర్ర రంగు రెయిన్‌కోట్, అమెరికా వైపు నుంచి వచ్చే వారికి నీలిరంగు రెయిన్‌కోట్ ఇస్తారు. అమెరికా సరిహద్దు నుంచి కెనడాలోని భవనాలు, రోడ్లు, కార్లు, ఇతర దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. నయాగరా జలపాతం అడుగు భాగానికి చేరుకునేందుకు కొండ ను చీల్చి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోకి వెళ్లేందుకు నయాగర నది పై నిర్మించిన వంతెన దాటి అవతలి వైపుకు వెళ్లాలి. ఈ మార్గంలో వెళ్లే సందర్శకులకు జారిపడిపోకుండా ప్రత్యేకమైన పాదరక్షలు ఇస్తారు. ఆ మార్గం దాటి వెళ్లే దారిలో తెల్లని పక్షులు స్వాగతం పలుకుతాయి. పక్షులను దాటి మెట్ల మార్గం ద్వారా నది సమీపంలోకి వెళ్లి, అక్కడ నుంచి జలపాతం పడుతున్న ప్రాంతాన్ని అతి సమీపం నుంచి చూడవచ్చు. రాత్రి పూట జలపాతం నీరు నీలి, ఎరుపు, పసుపు రంగుల్లో తిలకించవచ్చు. - జి.గంగాధర్ -
సగం భూమిని చుట్టేశారు!
దేశం కోసం సైన్యంలో పనిచేశారు... ఆ సేవల నుంచి విరామం తీసుకొని విదేశం వెళ్లారు. అక్కడి స్థిరనివాసి అయ్యారు. ఇక శేష జీవితాన్ని గడిపేయడమే తరువాయి అనుకొంటున్న సమయంలో ఆయన ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టారు. 70 యేళ్ల వయసు దాటాకా సగం భూమిని చుట్టేసిన ఘనత ప్రవాసాంధ్రులు మాధవపెద్ది శివరామ్ గారిది... మిలటరీ టు అమెరికా... 1944లో కృష్జా జిల్లా కంకిపాడు సమీపంలోని పామర్రులో జన్మించాను. తెనాలిలో విద్యాభ్యాసం ముగించాను. 1965లో డిగ్రీ పూర్తి చేశాను. 1966లో ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేశాను. 1972లో కెప్టన్‌గా పనిచేసి రాజీనామా చేశాను. 1972-88 మధ్య హైదరాబాద్‌లో ఓ పరిశ్రమ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత కొంత కాలానికి అమెరికా వెళ్లాను. అక్కడ వివిధ రకాల పెద్ద ఉద్యోగాలు చేశాను. 1988లో గ్రీన్‌కార్డు వచ్చింది. 2007లో నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. భూమి చుట్టూ తిరగాలని... గుండ్రంగా ఉన్న భూమి చుట్టూ తిరగాలని, కాశీలో తొమ్మిది రాత్రులు నిద్రించాలని కోరికలు ఉండేవి. 70 ఏళ్ల వయస్సులో ఇప్పుడు అవి సాధ్యమా అంటారు కొందరు. కానీ పట్టుదల.. కోరిక.. తపన.. ఉంటే చాలు దేనినైనా సాధించవచ్చు. ఆకాశ మార్గం సగభాగం భూమి చుట్టూ ప్రయాణించాను. కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేశాను. విహార యాత్రలతో విజ్ఞానం.. ఎంత ఎక్కువగా విహారయాత్రలు చేస్తే అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. 70 సంవత్సరాల వయస్సులో కూడా భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నా. తుది శ్వాస వరకు ఎన్ని వీలైతే అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాను. - కోన సుధాకర్ రెడ్డి -
విదేశీ విద్యకు దారులెన్నో..
విదేశీ విద్య.. భారత్‌లోని లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ప్రధానంగా ఇంజనీరింగ్, సెన్సైస్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఔత్సాహికుల్లో ఈ ఆలోచన ఎక్కువే. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆయా దేశాల్లోని విద్యా సంస్థలు.. మన దేశంలోని కన్సల్టెన్సీలతో ఒప్పందం ద్వారా ప్రవేశ ప్రక్రియను సులభం చేస్తూ విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలు దేశాల్లో సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఫాల్ సెమిస్టర్‌కు దరఖాస్తు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ దిశగా మన దేశ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలపై ఫోకస్.. అమెరికా... హాట్ స్పాట్ విదేశీ విద్య విషయంలో మన దేశ విద్యార్థులకు హాట్ స్పాట్‌గా నిలుస్తున్న దేశం అమెరికా. గత మూడేళ్లుగా అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కాస్త తగ్గింది. అయినా ఇతర దేశాలతో పోల్చితే అత్యధికుల గమ్యస్థానం నేటికీ అమెరికానే. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే అధికం. 2012-13 విద్యా సంవత్సరంలో అమెరికాలో మొత్తం 8 లక్షల మంది విదేశీ విద్యార్థులుంటే.. వారిలో లక్ష మంది వరకు మన దేశ విద్యార్థులే ఉండటం విశేషం. ప్రధానంగా బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి భారతీయ విద్యార్థులను ఆకట్టుకోవడంలో అమెరికా ముందంజలో ఉంది. ఆ దేశ బోధన విధానం.. ఆర్థిక ప్రోత్సాహకాలు.. అమెరికా పట్ల మన విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణం. దాంతోపాటు అమెరికాలో విద్యతో భవిష్యత్ బంగారం అవుతుందనే అనే ఆలోచన కూడా ఇందుకు దోహదం చేస్తోంది. అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీలు హార్వర్డ్ యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ పెన్సిల్వేనియా యూనివర్సిటీ యేల్ యూనివర్సిటీ మిచిగాన్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ చికాగో కార్నెగీ మిలన్ యూనివర్సిటీ ప్రవేశం: ఔత్సాహిక విద్యార్థులు ఆయా ఇన్స్టిట్యూట్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు నిర్దేశిత పత్రాలు(విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫీజు, నివాస వ్యయానికి సరిపడే విధంగా ఆర్థిక వనరుల రుజువు పత్రాలు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, రికమండేషన్ లెటర్స్, ప్రవేశపరీక్షల స్కోర్లు తదితర) అందించాలి. వీటి ఆధారంగా.. ఆయా ఇన్స్టిట్యూట్లు ఆఫర్ లెటర్ అందిస్తాయి. దీన్నే ఐ-20 ఫామ్‌గా పిలుస్తారు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలి. అమెరికా వీసా ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము చేరదలచుకున్న కోర్సు, ఇన్స్టిట్యూట్ విషయంలో అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం ఏడాది లేదా ఏడాదిన్నర ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టాలి. అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా రెండుసార్లు (జనవరి, సెప్టెంబర్) పూర్తి వివరాలకు: www.educationusa.state.gov ఆస్ట్రేలియా... మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్‌సకు పెట్టింది పేరు మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల బోధనలో పేరుగాంచిన దేశంగా ఆస్ట్రేలియా నిలుస్తోంది. స్టూడెంట్ వీసా నిబంధనలను సరళీకృతం చేయడం.. కొత్తగా పోస్ట్ స్టడీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పేరిట కోర్సు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలోనే రెండేళ్లు ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తోంది. అదేవిధంగా అభ్యర్థులు చూపించాల్సిన ఆర్థిక వనరుల మొత్తాన్ని కూడా కొంత తగ్గిస్తూ తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించడం.. భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియావైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో టాప్-100లో నిలిచిన పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఫిబ్రవరి, జూలై పేరున్న యూనివర్సిటీలు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ అడిలైడ్ యూనివర్సిటీ మొనాష్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పూర్తి వివరాలకు: www.immi.gov.au సింగపూర్... అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు కేవలం మూడు ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లే ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశం సింగపూర్. ముఖ్యంగా ఈ దేశం మేనేజ్మెంట్ కోర్సుల విషయంలో ఖ్యాతి పొందింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ చేరిన విద్యార్థులకు యు.ఎస్., చైనా సర్టిఫికెట్లు పొందే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. కోర్సు పూర్తయ్యాక ఒక ఏడాది పని చేసే అవకాశం కల్పించడం, కోర్సు సమయంలో వారానికి 16 గంటలు పార్ట్‌టైం జాబ్ చేసుకునే సదుపాయం వంటివి మన విద్యార్థులను సింగపూర్‌వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. అకడమిక్ సెషన్ ప్రారంభం: మార్చి, జూలై బెస్ట్ ఇన్స్టిట్యూట్స్: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్; నాన్యాంగ్ టెక్నలా జికల్ యూనివర్సిటీ. పూర్తి వివరాలకు: ww.singaporeedu.gov.sg జర్మనీ... నామమాత్రపు ఫీజులే! సైన్స్, ఇంజనీరింగ్, రీసెర్చ్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న దేశం జర్మనీ. అయితే ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించని ఇన్స్టిట్యూట్లలో చేరాలంటే.. దరఖాస్తు సమయంలోనే జర్మన్ భాషలో నైపుణ్యం ఉన్నట్లు తెలియజేయాలి. ఇందుకోసం అన్ని దేశాల్లోని జర్మనీ ఎంబసీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. జర్మనీలో విద్యాభ్యాసం దిశగా మరో ఆకర్షణీయ అంశం.. స్వల్ప ఫీజులు. జర్మనీ ప్రభుత్వ విధానాల ప్రకారం- చాలా యూనివర్సిటీలు ఫీజులు లేకుండానే లేదా సెమిస్టర్‌కు 500 యూరోల నామమాత్రపు ఫీజుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎలాంటి ఫీజు వసూలు చేయని ఇన్స్టిట్యూట్లలో చేరిన విద్యార్థులు సెమిస్టర్ కంట్రిబ్యూషన్ పేరుతో ప్రతి సెమిస్టర్‌కు 50 యూరోల నుంచి 250 యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవేకాకుండా ఎలాంటి కాలపరిమితి లేకుండా వర్క్ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం.. కోర్సు పూర్తయ్యాక కూడా 18 నెలలపాటు జర్మనీలో ఉండి ఉద్యోగాన్వేషణ సాగించేందుకు అవకాశం కల్పించడం జర్మనీలో విదేశీ విద్య ప్రత్యేకతలు. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఏప్రిల్, అక్టోబర్ పేరున్న ఇన్స్టిట్యూట్స్ హంబోల్ట్ యూనివర్సిటీ ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ టెక్నికల్ యూనివర్సిటీ మ్యూనిచ్ జార్జ్ అగస్ట్ యూనివర్సిటీ ఎబర్‌హార్డ్ కార్ల్స్ యూనివర్సిటీ టెక్నికల్ యూనివర్సిటీ బెర్లిన్ లీప్జిగ్ యూనివర్సిటీ జెనా యూనివర్సిటీ బ్రెమెన్ యూనివర్సిటీ రెగెన్స్‌బర్గ్ యూనివర్సిటీ పూర్తి వివరాలకు: www.studyin.de/en యూకే ప్రతిష్టాత్మక వర్సిటీలకు నెలవు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు నెలవు యునెటైడ్ కింగ్డమ్. అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులను విదేశీ విద్య కోసం విశేషంగా ఆకర్షిస్తున్న దేశం ఇది. విద్యార్థుల నమోదు సంఖ్య, క్రేజీ కోర్సుల పరంగానూ అమెరికా తర్వాత స్థానం యూకే యూనివర్సిటీలదే. బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తోంది యూకే. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ వ్యవధి రెండేళ్లు ఉండగా.. అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఫాస్ట్‌ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాదిలోనే పీజీ కోర్సులను అందిస్తుండటం కూడా ఈ దేశానికి మన విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం. రెండేళ్ల క్రితం వీసా నిబంధనలను కఠినం చేస్తూ.. పోస్ట్ స్టడీ వర్క్ వీసా సదుపాయాన్ని తొలగించడంతో యూకేకు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కొంతమేర తగ్గింది. అయితే చదువుకుంటున్న సమయంలోనే.. 20 వేల పౌండ్ల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందేట్లు స్పాన్సర్ లెటర్ అందించి.. చదువు పూర్తయ్యాక కూడా అక్కడే ఉండేలా నిబంధనను కొంత సడలించింది. అకడమిక్ సెషన్ ప్రారంభం: జనవరి, సెప్టెంబర్ యూకేలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ వార్విక్ యూనివర్సిటీ కింగ్స్ కాలేజ్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ లాంకెస్టర్ యూనివర్సిటీ గ్లాస్గో యూనివర్సిటీ పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ukvisas.gov.uk జపాన్.. సైన్స అండ్ టెక్నాలజీ కోర్సులు ప్రతి ఏటా దాదాపు 50 వేల మందికిపైగా విదేశీ విద్యార్థులు అడుగుపెడుతున్న దేశం జపాన్. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఎన్నో ఇన్స్టిట్యూట్లు జపాన్‌లోనే ఉన్నాయి. ఈ దే శంలో ఇన్స్టిట్యూట్లోనే అనుబంధంగా ఆర్ అండ్ డీ సంస్థలు ఉంటాయి. దాంతో విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వీలవుతుంది. రీసెర్చ్ విభాగాల్లో పాల్పంచుకునే విద్యార్థులకు రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్ లభిస్తుంది. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఏప్రిల్, అక్టోబర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో క్యోటో యూనివర్సిటీ ఒసాకా యూనివర్సిటీ టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నగోయా యూనివర్సిటీ క్యుషు యూనివర్సిటీ వసెడా యూనివర్సిటీ కోబ్ యూనివర్సిటీ టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ పూర్తి వివరాలకు: www.jasso.go.jp కెనడా... సైన్స, పీహెచ్‌డీలకు చిరునామా సైన్స్ కోర్సులకు, పీహెచ్‌డీలకు చిరునామా కెనడా. ఇంజనీరింగ్, ఏవియేషన్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల ఔత్సాహికులకు బెస్ట్ ఇన్స్టిట్యూట్లలో చదివే అవకాశం ఇక్కడ లభిస్తుంది. పీహెచ్డీ స్థాయిలో కెనడాలోని అన్ని ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు ఇండస్ట్రీ కొలాబరేషన్‌తో రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతో పీహెచ్‌డీకి సరైన వేదికగా ఈ దేశాన్ని పేర్కొనొచ్చు. అదే విధంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించి.. పని అనుభవం కలిగిన ఉన్నత విద్యావంతులు కెనడాలోనే శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు సైతం కల్పించారు. ఈ కారణంగా గత ఐదేళ్లుగా కెనడాకు వెళుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అకడమిక్ సెషన్ ప్రారంభం: జనవరి, సెప్టెంబర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మెక్‌గిల్ యూనివర్సిటీ క్వీన్స్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ టోరంటో వాటర్లూ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా యూనివర్సిటీ డి మాంట్రియల్ మెక్‌మాస్టర్ యూనివర్సిటీ వెస్ట్రన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ కల్గెరీ పూర్తి వివరాలకు: www.educationau-incanada.ca/ రష్యా... మెడికల్, ఫార్మసీ కోర్సులకు కేరాఫ్ మెడికల్, హెల్త్, ఫార్మసీ, నర్సింగ్, ఏవియేషన్ కోర్సులకు కేరాఫ్‌గా రష్యా పేరు గడిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో వైద్య విద్య ఔత్సాహికులకు రష్యానే ప్రధాన గమ్యం. ఎంబీబీఎస్ కోర్సు కోసమే ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల మంది రష్యాకు వెళుతున్నారు. అయితే ఈ దేశానికి వెళ్లే విద్యార్థులు ప్రధానంగా గమనించాల్సిన అంశం.. అక్కడ తాము చేరాలనుకుంటున్న కళాశాలలో బోధన మాధ్యమం. అధిక శాతం ఇన్స్టిట్యూట్లు స్థానిక భాషలోనే బోధిస్తున్నాయి. ఈ మేరకు సదరు ఇన్స్టిట్యూట్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆ భాషపై పరిజ్ఞానం పొందాల్సి ఉంటుంది. నెలకు 80 డాలర్ల నుంచి వంద డాలర్ల లోపు నివాస వ్యయం ఇక్కడ ప్రధానంగా కలిసొచ్చే అంశం. ప్రముఖ యూనివర్సిటీలు సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ మాస్కో మెడికల్ అకాడమీ మాస్కో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ ఎల్.పి.పావ్లోవ్ మెడికల్ యూనివర్సిటీ రష్యన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ సదరన్ ఫెడరల్ యూనివర్సిటీ వొరోనెజ్ స్టేట్ యూనివర్సిటీ బౌమన్ మాస్కో స్టేట్ టెక్నికల్ యూనివర్సిటీ అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా సెప్టెంబర్ పూర్తి వివరాలకు వెబ్సైట్: en.russia.edu.ru న్యూజిలాండ్... మేనేజ్మెంట్, అగ్రికల్చర్ తక్కువ వ్యయంతో కోర్సులు పూర్తి చేసుకునే అవకాశమున్న దేశం న్యూజిలాండ్. ముఖ్యంగా మేనేజ్మెంట్, అగ్రికల్చర్ కోర్సుల విషయంలో ఈ దేశ యూనివర్సిటీలకు మంచి పేరుంది. ఎంబీఏ, ఇతర పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు బ్యాచిలర్‌స డిగ్రీ తర్వాత రెండేళ్ల పని అనుభవం పొందడం తప్పనిసరి! ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఏడాది కాలపరిమితి గల జాబ్ సెర్చ్ వీసా పొంది.. అక్కడే ఉద్యోగాన్వేషణ సాగించే సదుపాయం ఉంది. కొన్ని కోర్సులకు మన దేశంలో బోధించే మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రవేశం లభిస్తోంది. ఎంఎస్, ఎంటెక్ వంటి స్పెషలైజ్డ్ కోర్సుల్లో చేరాలంటే.. 16 ఏళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో యూనివర్సిటీ ఆఫ్ కాంటెర్బరీ విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్ మాసే యూనివర్సిటీ వ్యకాటో యూనివర్సిటీ లింకన్ యూనివర్సిటీ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా మార్చి నెలలో పూర్తి వివరాలకు: www.immigration.govt.nz అమెరికా ఔత్సాహికులు అప్రమత్తంగా అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏటా రెండుసార్లు మొదలయ్యే అకడమిక్ సెషన్ కోసం 12 నుంచి 14 నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభించడం మేలు. ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో అమెరికాలో కొన్ని ఫేక్ యూనివర్సిటీల్లో చేరడం వల్ల ఎందరో విదేశీ విద్యార్థులు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఔత్సాహిక విద్యార్థుల కోసం యునెటైడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యుఎస్‌ఐఈఎఫ్) తరఫున హెల్ప్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అభ్యర్థులు దీన్ని వినియోగించుకుంటే కచ్చితమైన సమాచారం లభిస్తుంది. రేణుక రాజారావు, కంట్రీ కో-ఆర్డినేటర్, యుఎస్‌ఐఈఎఫ్ కూలంకషంగా పరిశీలించి.. స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక విద్యార్థులు.. తాము ఎంచుకున్న కోర్సు, గమ్యాలకు సంబంధించి కూలంకషంగా పరిశీలన చేయాలి. అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. సాధారణంగా విదేశాల్లోని యూనివర్సిటీలు.. ప్రవేశాల విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేయవు. కాబట్టి విద్యార్థులు సదరు యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్లను చూస్తూ నిర్ణీత గడువు తేదీలను, ఇతర ప్రవేశ నిబంధనలను తెలుసుకోవాలి. వాటికి సరితూగుతామనే ఆత్మవిశ్వాసం లభించాకే దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి. దరఖాస్తు సమయంలో జత చేయాల్సిన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ను పకడ్బందీగా రూపొందించుకోవాలి. నిర్దేశిత టెస్ట్ (జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్, ఐఈఎల్టీఎస్, శాట్ తదితర)ల్లో స్కోర్ బాగా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సరిగా లేక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అందుకే ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అకడమిక్ సెషన్ ప్రారంభానికి సంవత్సరం ముందు నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. అలా చేస్తేనే సదరు ఇన్స్టిట్యూట్ నిబంధనల మేరకు అడ్మిషన్ ప్రక్రియ సరైన సమయంలో పూర్తి చేసుకోవడం సులువవుతుంది. సోను హిమాని, సీనియర్ మేనేజర్, ఎడ్యుకేషన్ యూకే, (సౌత్ ఇండియా బ్రిటిష్ కౌన్సిల్) విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించి.. సిద్ధం చేసుకోవాల్సినవి... జీఆర్ఈ/టోఫెల్, జీమ్యాట్/ఐఈఎల్టీఎస్/ ఎస్ఏటీ పరీక్షల్లో స్కోరు. దరఖాస్తుతోపాటు కవరింగ్ లెటర్ అప్లికేషన్ ఫీజు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్ ఆఫ్ రికమండేషన్ విద్యార్హతల సర్టిఫికెట్లు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పాస్‌పోర్ట్ స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయ పన్ను స్టేట్మెంట్ -
అదనపు కట్నం కోసం వేధింపులు
బాధితురాలి ఫిర్యాదుతో ఎన్నారై భర్తకు బ్లూ కార్నర్ నోటీస్ విజయవాడ: అదనపు కట్నం కోసం ఎన్నారై భర్త, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై విజయవాడ మహిళా పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్న యువకుడి తల్లిదండ్రులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న భర్తను రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ పటమటలంకకు చెందిన గుత్తికొండ కిషోర్ కుమార్తె లక్ష్మీగౌతమికి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెం.1కి చెందిన గోగినేని రాజేంద్రబాబు కుమారుడు శ్రీసత్యవర్థన్తో 2012లో వివాహం జరిగింది. రూ.కోటి నగదు, 200 కాసుల బంగారు నగలు లాంఛనాలుగా ముట్టచెప్పారు. వివాహ సమయంలో శ్రీసత్యవర్థన్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. గౌతమి అమెరికాలోని వర్జీనియా వర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. వివాహమైన కొద్దికాలం నుంచే తల్లిదండ్రులు, ఉంగుటూరులో ఉంటున్న తాత గోగినేని విష్ణువర్ధనరావు ప్రోద్బలంతో శ్రీసత్యవర్థన్ భార్యను వేధింపులకు గురిచేశాడు. ఆమె పేరిట ఉన్న ఆస్తులను అమ్మి రూ.8 కోట్లు తెస్తేనే కాపురం చేస్తానని చెప్పడంతో..పెద్దలు నచ్చ చెప్పారు. పలుమార్లు నచ్చచెప్పినా ఫలితం లేకపోవడంతో గత నెల 16న లక్ష్మీగౌతమి నగరంలోని మహిళా పోలీసుస్టేషన్ అధికారులను ఆశ్రయించింది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తుంటే..అత్తమామలు, అతని తాత ప్రోత్సహిస్తున్నట్టు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు అనుమతి తీసుకుని శుక్రవారం ఉదయం శ్రీసత్యవర్థన్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. అమెరికాలో ఉంటున్న శ్రీసత్యవర్థన్ను అదుపులోకి తీసుకునేందుకు ‘బ్లూ కార్నర్’ నోటీసు జారీ చేశారు. కాగా, శ్రీసత్యవర్థన్ తల్లిదండ్రులు పలుకుబడినవారు కావడంతో పోలీసులపై ఒత్తిళ్లు పెరిగాయి. ఇదే సమయంలో కేసు విషయంలో మరోసారి ఆలోచించుకోమంటూ లక్ష్మీగౌతమి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసే పనిలో పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం. కాగా, శ్రీసత్యవర్థన్ తల్లిదండ్రులను విచారణ కోసమే తీసుకొచ్చినట్టు మహిళా పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ సహేరా తెలిపారు. విచారణ జరిపిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. -
పండ్ల మీద పన్ను..
కోటీశ్వరుల నుంచి సామాన్యుల దాకా పన్నుల మోతకు ఎవరూ అతీతం కాదు. ఆదాయపు పన్ను కావొచ్చు లేదా అమ్మకం పన్ను కావొచ్చు.. ప్రాపర్టీ ట్యాక్సు కావొచ్చు ఏదో ఒక రూపంలో వడ్డన ఉంటూనే ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని దేశాల్లో కొన్ని చిత్ర విచిత్ర పన్నులు కూడా ఉన్నాయి. అందులో కొన్ని.. వెండింగ్ మెషీన్ ఫ్రూట్ ట్యాక్స్.. తాజా పండ్లు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, అమెరికాలోని కాలిఫోర్నియాలో వెండింగ్ మెషీన్ల నుంచి కొంటే మాత్రం పర్సుకు చేటు చేస్తాయి. ఎందుకంటే.. మెషీన్ల నుంచి తాజా ఫలాలపై కాలిఫోర్నియాలో 33% పన్ను వడ్డిస్తారట. అమెరికాలో టాప్ 10 అసాధారణ పన్నుల్లో ఇది చోటు దక్కించుకుంది. సిగరెట్ల మోత.. సిగరెట్ల మీద భారీ ట్యాక్స్‌లతో ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల గురించి తెలిసిందే. అయితే, చైనాలోని హుబై ప్రావిన్స్ మరో అడుగు ముందుకెళ్లింది. ప్రజలు మరింత ఎక్కువగా సిగరెట్లు తాగేలా ప్రోత్సహించి.. తద్వారా మరింత పన్నులను రాబట్టుకోవడంపై దృష్టి పెట్టింది. సంక్షోభాల నుంచి ఎకానమీ సురక్షితంగా ఉండాలంటే అధికారులు ఏటా 400 కార్టన్ల సిగరెట్లు ఊదిపారేయాలంటూ 2009లో హుబై ప్రావిన్స్‌లోని ఒక గ్రామం ఆదేశించింది. టీచర్లకు కూడా స్మోకింగ్ కోటా విధించింది. టార్గెట్లు అందుకోకపోయినా.. పక్క రాష్ట్రాల కంపెనీల సిగరెట్లు తాగుతూ పట్టుబడినా జరిమానాలతో వాతలు పెట్టింది. టాటూలపై ట్యాక్స్ అమెరికాలోని ఆర్కాన్సాస్ ప్రభుత్వం 2005లో టాటూలపైనా ట్యాక్స్ విధించి ప్రత్యేకతను చాటుకుంది. ఎలక్ట్రోలసిస్ ట్రీట్మెంట్ను కూడా ఇందులోకి చేర్చింది. -
నాస్తికుల కోసం టీవీ చానల్!
నమో నాస్తికా! ప్రపంచ వ్యాప్తంగా ప్రతి టీవీ చానల్లోనూ భక్తి కార్యక్రమాలు ప్రసారం అవుతుంటాయి. కేవలం భక్తికి మాత్రమే పరిమితమై, ఇరవై నాలుగు గంటలూ భక్తి విశేషాలనే ప్రసారం చేస్తుండే చానళ్లూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారి ఒక నాన్-భక్తి చానల్ రాబోతోంది. అంటే నాస్తికుల చానల్ అని! జూలైలో అమెరికాలో మొదలు కాబోతున్న ఈ చానల్‌కు ఇంకా పేరు నిర్ణయించలేదు. ఈ నెల మొదటి వారంలో ‘అమెరికన్ అఫీయిస్ట్స్’ (అమెరికా నాస్తికులు) సంస్థ అధ్యక్షుడు డేవిడ్ సిల్వర్మేన్ ఈ విషయాన్ని ప్రకటించినప్పుడు అమెరికాలోని యువ నాస్తికులు, విశాల దృక్పథం గల ఆలోచనాపరులు హర్షం వ్యక్తం చేశారట! ‘‘ఎందుకు మేమీ చానల్‌ను ప్రారంభిస్తున్నామో మీకు తెలుసా?’’ అని అడిగి, సమాధానం కోసం ఎదురు చూడకుండానే, ‘‘మనం ఎక్కడికైతే వెళ్లలేమో అక్కడికి వెళ్లే వ్యూహంలో భాగంగానే ఈ కొత్త చానల్‌ను తెస్తున్నాం’’ అని సిల్వర్మేన్ అన్నారు. దీని అర్థం ఏమిటో ఆయన సభకు హాజరైన నాస్తిక మిత్రులకే తెలియాలి. ‘రొకు’ అనే ఇంటర్నెట్ ప్లేయర్‌ను కేబుల్ బాక్సులా టీవీలకు అమర్చుకోవడం ద్వారా నాస్తిక చానల్ కార్యక్రమాలను చూడవచ్చని; రోజుకు 24 గంటలు, 365 రోజులూ నిర్విరామంగా జరిగే ఈప్రసారాలు తొలి విడతగా 70 లక్షల మంది అమెరికన్లకు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని సిల్వర్మేన్ చెబుతున్నారు. వీడియోలు, ప్రసంగాలు, వ్యక్తిగత అనుభవాల రూపంలో కార్యక్రమాలను రూపొందించే పని ఇప్పటికే మొదలయిందని కూడా ఆయన తన సభకు హాజరైన నాస్తికులను ఉత్సాహపరిచారు. వారిలో ఒక ఔత్సాహికుడు ‘‘రేడియో చానల్ ను కూడా తెస్తే బాగుంటుంది కదా’’ అని సూచించినప్పుడు ‘‘బ్రిలియంట్ ఐడియా’’ అని సిల్వర్మేన్ అతడిని అభినందించారు. ‘‘మీ కోసం తప్పకుండా తెస్తాం’’ అని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ప్రముఖంగా 100 క్రైస్తవ టీవీ చానళ్లు, 4 యూదుల టీవీ స్టేషన్లు ఉన్నాయి. వాటికి దీటుగా ప్రజల్లో నాస్తికత్వాన్ని పెంపొందించడానికి సిల్వర్మేన్ కృషి చేస్తున్నారు. చూడాలి ఎంతమంది ఆయన ప్రయత్నాన్ని ఆదరిస్తారో. -
ఏదైనా కొనేస్తాం..
అమెరికాకు దీటుగా గతకాలపు ప్రాభవాన్ని మళ్లీ సాధించే దిశగా అడుగులు వేస్తున్న రష్యాలో ప్రజల ఆర్థిక అలవాట్ల గురించి ఈ వారం కంట్రీ కథలో.. గతంలో ఏదైనా కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు రష్యన్లు. అత్యంత జాగ్రత్తగా ఖర్చుపెట్టేవారు. కానీ ప్రస్తుతం ట్రెండు మారి.. వెస్ట్రన్ ధోరణి పెరుగుతోంది. ఖర్చు చేసే విషయంలో చాలా స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. దాచి పెట్టడం కన్నా ఖర్చు పెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా ఫ్రిజ్‌లు, గృహోపకరణాలు, ఆహార పదార్థాలు, దుస్తులు వంటి వాటిపై ఎక్కువగా రష్యన్లు ఖర్చు పెడుతున్నారు. అలాగే, హాలిడే టూర్లు, పార్టీలపైనా బాగానే వెచ్చిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే సగటు రష్యన్లు గృహోపకరణాలపై రెండు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తారట. వాషింగ్ మెషిన్లు, మొబైల్ ఫోన్లు వంటి వాటి కొనుగోళ్ల విషయంలో.. యూరప్‌లో మిగతా దేశాల వారిని అధిగమించేశారు రష్యన్లు. బీరు వినియోగంలో జర్మన్లతో పోటీపడుతున్నారు. ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొచ్చినప్పుడు.. డబ్బుపరంగా దాచుకోవాలంటే అది తమ కళ్లముందు కనిపించే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు రష్యన్లు. బ్యాంకులు, వర్చువల్ ఇన్వెస్ట్మెంట్లు మొదలైన వాటి జోలికి ఎక్కువగా పోరు. అధికాదాయ వర్గాలకు చెందిన వారు రియల్ ఎస్టేట్‌పై ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇవి గాకుండా కార్లు కూడా బాగానే కొంటారు. జర్మనీలో తయారైన వాటికి కాస్త ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. రష్యాలో కేవలం అయిదు శాతం జనాభా మాత్రమే స్టాక్స్, మ్యుచువల్ ఫండ్స్ వాటి వాటిల్లో నేరుగా పెట్టుబడి పెడుతుంటారు. కేవలం రెండు శాతం జనాభాకు మాత్రమే బీమా కవరేజి ఉంది. క్రెడిట్ కార్డుల వినియోగంలో మాత్రం రష్యన్లు బాగా చురుగ్గానే ఉన్నారు. -
ఎడిసన్ ఉప్పు ఫార్ములా!
సమస్యను కొత్త కోణంలో చూడండి విద్యుత్ బల్బుతోపాటు ఎన్నో వస్తువులను కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన అమెరికా పరిశోధకుడు థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం చాలా భిన్నంగా ఉండేది. తన పరిశోధనలకు అవసరమైన సహాయకులను ఎడిసన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తూ ఉండేవారు. మొదట సాధారణ ప్రశ్నలు అడిగిన తర్వాత.. తనకు తగిన అభ్యర్థి అనిపిస్తే అతడిని భోజనానికి తీసుకెళ్లేవారు. ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉండేది. భోజనం వచ్చిన తర్వాత ఎడిసన్ కొంత తీసుకొని నోట్లో వేసుకొనేవారు. ఈ ఆహారంలో ఉప్పు సరిపోలేదనుకుంటా! అంటూ అభ్యర్థిని నిశితంగా పరిశీలించేవారు. అప్పుడు సదరు అభ్యర్థి కూడా కొంత భోజనాన్ని రుచి చూసి, ఉప్పు సరిగ్గా ఉందో లేదో చెబితే అతడు ఎంపికైనట్లే. కానీ రుచి చూడకుండానే ఉప్పును కలుపుకుంటే.. ఇంటి ముఖం పట్టాల్సిందే. మనుషుల మనస్తత్వం ఎడిసన్‌కు బాగా తెలుసు. మానవులు సాధారణంగా ఇతరులు చెప్పినదాన్నే గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఏదైనా అంశంపై తమకు తగిన అనుభవం, పరిజ్ఞానం లేకపోయినా దానిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దాన్నే అనుసరిస్తుంటారు. తమకు ఎదురైన సమస్యను కొత్త కోణంలో చూడడం, దాని పరిష్కారానికి భిన్నంగా ఆలోచించడం ఎక్కువ మందికి అలవాటు లేని పని. మనసులో ఒక అభిప్రాయం నాటుకుపోతే.. ఇక దాన్ని ఎప్పటికీ వదులుకోరు. ఇతరుల ఆలోచనలను అనుసరించకుండా సొంతంగా ఆలోచించే వ్యక్తుల కోసం ఎడిసన్ గాలిస్తూ ఉండేవారు. ప్రయత్నమే మూలాధారం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు రావాలంటే చాలా కష్టం.. అని మీ స్నేహితులు మీకు చెప్పే ఉంటారు. దాంతో మీరు అది నిజమేననుకుంటారు. మీ ఆలోచనలు అలాగే మారిపోతాయి. ఐఐటీలో సీటు మనకెక్కడ వస్తుందిలే అని తీర్మానించుకుంటారు. ‘సీటు తెచ్చుకోవడం నా వల్ల కాదు’ అనే దృక్పథం మీలో బలంగా ఏర్పడుతుంది. ఐఐటీ పరీక్షకు దరఖాస్తు చేయడానికి కూడా సంకోచిస్తారు. ఇతరులెవరో సాధించలేదు కాబట్టి మీరు కూడా సాధించలేరని అనుకుంటారు. అలా అనుకోవడం తెలివైన లక్షణం కాదు. ఐఐటీలో సీటు తెచ్చుకోవడం కష్టమే కావొచ్చు.. కానీ ప్రతిఏటా వందలాది మంది సీటు సాధిస్తున్నారు కదా! వారు సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? కాబట్టి ఓపెన్ మైండ్‌తో ఉండండి. నేను తప్పకుండా సాధించగలను అనే సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోండి. అప్పుడు ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతిభ, మేధస్సు ఉండగానే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది చేసి చూపుతారు. జీవితంలో కోరుకున్న మార్పు రావాలంటే ప్రయత్నమే మూలాధారం. సొంత ఆలోచనలతో ముందుకు ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇతరుల ఆలోచనా దృక్పథం మీకు పనికి రావొచ్చు, రాకపోవచ్చు. మీరు చేయగలిగే, చేయలేని.. మీకు సాధ్యమయ్యే, సాధ్యం కాని పనిని ఇంకెవరో నిర్ణయించే పరిస్థితి తెచ్చుకోవద్దు. పరిశ్రమల యాజమాన్యాలు, బిజినెస్ స్కూల్స్, మొత్తం ప్రపంచం.. ఇప్పుడు సొంత ఆలోచనలతో ముందుకెళ్లే అభ్యర్థుల కోసమే వెతుకుతున్నాయి. అపజయాలే విజయానికి సోపానాలు మీకు ప్రేరణ కల్పించే గొప్ప వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారా? ఎడిసన్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఆయన బాల్యంలో పెద్ద ప్రతిభ ఉన్న విద్యార్థి కాదు. పైగా చెవుడు కూడా ఉంది. పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎడిసన్ తన ఇంట్లోనే విద్యాభ్యాసం కొనసాగించారు. ఎన్నో వస్తువులను కనిపెట్టారు. వైఫల్యాలు ఎదురైనా ముందుకే వెళ్లారు. అపజయాలను విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు. ప్రతి ఓటమి నుంచి ఓ విలువైన పాఠం నేర్చుకున్నానని ఆయన స్వయంగా చెప్పారు. ఎడిసన్ కీర్తి కిరీటంలో ఎన్నో పేటెంట్లు ఉన్నాయి. అలుపెరుగక శ్రమించే తత్వంతోనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. మీ కృషికి సొంత ఆలోచనలను జోడించండి. రుచి చూడకుండానే భోజనంలో ఉప్పు వేసుకోకండి!! -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
పొదుపు, రిటైర్మెంట్ ఈ రెండే ముఖ్యం
ప్రపంచానికి పెద్దన్న.. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ.. అలాంటి అమెరికాలో ప్రజల ఆదాయ వ్యయాల తీరు ఎలా ఉంటుంది? పెట్టుబడుల విధానమేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం కంట్రీ కథ... అమెరికా అంటే 50 సమాఖ్య రాష్ట్రాల కూటమి. వీటికి సమాఖ్య జిల్లా వాషింగ్టన్ డీసీ అదనం. అగ్రరాజ్యమే అయినా ఐదేళ్ల కిందట మాంద్యం చేసిన గాయం ప్రభావం మామూలుగా లేదు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎంత సంపన్న దేశమైనా ప్రజా సంక్షేమ పథకాల విషయాల్లో దానికన్నా వర్ధమాన దేశాలే మెరుగ్గా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. సోషల్ సెక్యూరిటీ వ్యవస్థ కింద అమెరికా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పింఛను అంతంత మాత్రంగానే ఉంటోంది. వైద్య బీమాకి సంబంధించి నిధుల్లో కొంత ప్రభుత్వం సమకూరిస్తే... మిగతాది ఉద్యోగులు, వారు పనిచేసే కంపెనీలు చెరికాస్త సమకూరుస్తున్నాయి. పొదుపు: చూడటానికి కుబేరుల కంట్రీగానే కనిపిస్తున్నా అమెరికాలో మూడింట రెండొంతుల మందిది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అక్కడి వారి జీతభత్యాల గురించి లెక్కలేసే అమెరికన్ పే రోల్ అసోసియేషన్ స్వయంగా చెప్పిన విషయమిది. మాంద్యం దరిమిలా అమెరికన్లు మెల్లగా పొదుపుపై దృష్టి సారిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నాటి సంక్షోభానికి బ్యాంకులే కారణమైనా... ఇప్పటికీ డబ్బు దాచుకునేందుకు బ్యాంకులే సురక్షితమైనవని వారు విశ్వసిస్తున్నారు. ఖర్చులు: అమెరికన్లు తమ ఆదాయంలో 30-40 శాతాన్ని హౌసింగ్పైన, 11-16 శాతాన్ని ఆహారంపైన వెచ్చిస్తుంటారు. అధికాదాయ వర్గాలు (ఏడాదికి 92,000 డాలర్లకు పైగా సంపాదించే వారు) మాత్రం వీటిపై ఇంతకన్నా తక్కువేఖర్చు చేస్తుంటారట. అధికాదాయ వర్గాలు వ్యక్తిగత బీమాకు, పింఛన్లకు అత్యధికంగా 16 శాతం మేర కేటాయిస్తుండగా.. అల్పాదాయ వర్గాలు (35,000 డాలర్ల కన్నా తక్కువ సంపాదించేవారు) 5.3 శాతం మాత్రమే వీటికి కేటాయించగలుగుతున్నారు. పెట్టుబడులు: చాలా మంది అమెరికన్ల దగ్గర షేర్లు, బాండ్లు ఉంటాయి. రిటైర్మెంట్ పథకాల ద్వారా వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతేడాది లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్లలో అమెరికన్ల పెట్టుబడులు ఏకంగా 13.6 లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్లలో అత్యధికులు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటంతో పాటు మిగతా ప్రపంచ దేశాల ఫండ్లు కూడా అమెరికన్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అందుకే వీటి విలువ చాలా ఎక్కువ.