Vasantha panchami celebrations
-
బాసర ఆలయంలో ఘనంగా వసంత పంచమి
-
ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు
-
భక్తజన సంద్రం బాసర క్షేత్రం..
భైంసా టౌన్/బాసర(ముథోల్): చదువుల తల్లి కొలువైన బాసర పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వసంత పంచమి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం రాత్రి 2 గంటల నుంచే ఆలయంలో భక్తులు క్యూలైన్లో నిరీక్షిస్తూ కనిపించారు. వేదపండితులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ శోభా సత్యనారాయణ గౌడ్తోపాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. లక్షకు పైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. 5,850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం వసంతి పంచమి సందర్భంగా ఆలయంలో 5,850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. రూ.100, రూ.1000 అక్షరాభ్యాసం టికెట్లతోపాటు ప్రత్యేక దర్శనం టికెట్లు, లడ్డూ, పులిహోర అమ్మకాల ద్వారా ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.42,49,350 ఆదాయం సమకూరినట్లు ఆలయ ప్రత్యేకాధికారి ఎ.సుధాకర్రెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు.. ఈ ఏడాది బాసరకు భక్తుల తాకిడి పెరిగింది. వీఐపీ క్యూలైన్లో కూడా బారులు తీరి కనిపించారు. రూ.వెయ్యి అక్షరాభ్యాసం క్యూలైన్ పరిస్థితి కూడా అలాగే కనిపించింది. ఆలయ అధికారుల సమన్వయ లోపం కారణంగా సుమారు ఐదు గంటలపాటు భక్తులు క్యూలో ఇబ్బందులు పడ్డారు. అక్షరాభ్యాస పూజల అనంతరం భక్తులను మండపం నుంచి పంపించే ఏర్పాట్లలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో అక్షరాభ్యాస మండపం నుంచి గర్భగుడికి వెళ్లే మార్గంలో గంటలపాటు భక్తులకు నిరీక్షణ తప్పలేదు. శనివారం రాత్రి బాసర చేరుకున్న సామాన్య భక్తులకు అతిథిగృహాలు దొరకలేదు. అనేకమంది చలిలో ఆలయ ఆవరణలోనే రాత్రంతా జాగరణ చేశారు. -
అమెరికాలో ‘వసంత పంచమి’
నిర్మల్/బాసర: బాసర క్షేత్రం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది వసంత పంచమి వేడుకలకు ఏర్పాటు చేయటం.. ఇక్కడి నుంచి పూజసామగ్రి.. పూజారులను తరలించే యత్నం చేశారు. ఇప్పటికే పంపిణీ చేసిన కరపత్రం.. ఇక్కడి నుంచి పూజారులను, పూజా సామగ్రిని తరలించేయత్నం వంటి చర్యలన్నీ అధికారిక కార్యక్రమాన్ని తలపిస్తుండగా.. ఆలయ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదనడం చర్చనీయాంశంగా మారింది. బాసర దేవస్థానం పేరిట ఈనెల 20న అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే అక్కడ కరపత్రాలు పంపిణీ చేశారు. పూజాసామగ్రి కూడా దేవస్థానమే అందిస్తోందని కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, అమెరికాలో పూజా కార్యక్రమాలకు ఇక్కడి ఆలయం నుంచి విగ్రహాలు, ఎలాంటి పూజాసామగ్రి, అర్చకులు వెళ్లడం లేదని ఈవో సోమయ్య పేర్కొన్నారు. ఆలయ రిటైర్డ్ ఈవో వెనకుండి ఈ కార్యక్ర మాన్ని జరిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు కరపత్రంలో అతని పేరు ఇప్పటికీ ఈవోగానే ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులు, ఇద్దరు ఉద్యోగులను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, వారి వీసాలు రద్దు కావటంతో పక్క జిల్లాకు చెందిన అర్చకులను తీసుకెళ్తున్నట్లు సమాచారం. -
ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు
ఆదిలాబాద్: జిల్లాలోని బాసరలో వసంత పంచమి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమైయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు బారులు తీరారు. అయితే ఈ వేడుకల సందర్భంగా ప్రభుత్తం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించనున్నట్టు సమాచారం.