కింగ్ కోబ్రాకు నీళ్లు తాగించడం చూశారా..!
న్యూఢిల్లీ: దాహంతో ఉన్న జంతువులకు నీళ్లు తాగించడమే చాలా అరుదు. అలాంటిది పాములకు నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తామా? అదీ కూడా ఒక తీవ్ర విషపూరితమైన కింగ్ కోబ్రాకు తాగించే సాహసం అంటే ఊహించుకోగలమా? కానీ, అదే జరిగింది. తీవ్రమైన ఎండాకాలం కారణంగా దాహార్తితో జనావాసాలకు వచ్చిన ఓ కింగ్ కోబ్రాకు వైల్డ్‌లైఫ్ జంతువుల సంరక్షణ విభాగంలో పనిచేసే వ్యక్తి అలవోకగా ఏ మాత్రం భయం లేకుండా వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించాడు. ఆ పాము కూడా చక్కగా చంటి పాపలా కదలకుండా నీళ్లు తాగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కైగా అనే గ్రామంలోకి ఓ భారీ విషసర్పమైన కింగ్ బ్లాక్ కోబ్రా వచ్చింది.
సాధారణంగా కింగ్ కోబ్రాలు అత్యంత అరుదుగా మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. ప్రస్తుతం వేసవికాలం కారణంగా ఆ భారీ విష సర్పం జనాల మధ్యకి వచ్చింది. దీనిని చూసి తీవ్రంగా జనాలు భయపడిగా అక్కడికి వణ్యప్రాణి సంరక్షణ విభాగానికి చెందిన వారిని పంపించారు. అక్కడికి వచ్చిన వారిలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా తోక పట్టుకోగా మరో వ్యక్తి చక్కగా వాటర్ బాటిల్‌తో నీటిని తాగించాడు. అనంతరం దానిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.