'అగ్రి ‘వర్సిటీలో విద్యార్థిపై దాడి
హైదరాబాద్: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థిపై బుధవారం రాత్రి దాడి జరిగింది. వర్సిటీ బి.హాస్టల్లో బీఎస్సీ ఫైనలియర్ చదువుకుంటున్న వేణు సీతారాం అనే విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.