పెంబర్తి చెక్‌పోస్టు వద్ద రూ. 8.38 లక్షలు సీజ్
జనగామ(వరంగల్): వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో జనగామ మండలం పెంబర్తి చెక్‌పోస్టు వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో రూ.8.38 ల క్షల నగదు లభ్యమైంది. జనగామ సీఐ నర్సింహారావు ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ నుంచి ఎంహెచ్ 43ఎన్ 4439 నెంబరు గల కారులో ఓ మహిళ రూ.8.38 లక్షలను తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఆ మహిళ అనుమానాస్పదంగా సమాధానం చెప్పడంతో కారు డ్రైవర్‌ను, మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.