వియ్ ఆర్ ద క్రియేటర్స్
నేను ఫెమినిస్టు (స్త్రీవాది). అమ్మాయిలు, అబ్బాయిలు సమానమని కొందరు అంటుంటారు. నేను ఒప్పుకోను. ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే గొప్ప.
అమ్మాయిలు లేకపోతే ఈ జగమే లేదు.‘వియ్ ఆర్ ద క్రియేటర్స్’. అయినప్పటికి ఇంకా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు ఇద్దరు మగపిల్లలు. నా కెరీర్‌తో ఇప్పుడు బిజీగా ఉన్నాను. కానీ, తప్పనిసరిగా ఒక అమ్మాయిని కంటాను. ఒక అమ్మాయికి అమ్మ కాకపోతే నా జీవితం సంపూర్ణం కాదు.