తెలంగాణ అసెంబ్లీ వెబ్సైట్ ల ఆవిష్కరణ
హైదరాబాద్: తెలంగాణా శాసనసభ కార్యకలాపాలకు సంబంధించి రూపొందించిన తెలుగు, ఉర్దూ వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ ఒకటిలో జరిగింది.
రెండు వెబ్సైట్ లతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల, సభ్యుల పోట్రల్ను కూడా స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు , డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి , శాసనసభ సచివాలయం కార్యదర్శి రాజసదారాం .జాయింట్ సెక్రటరీ నరసింహాచార్యులు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.