సమ్మె నోటీసిచ్చిన డాక్టర్లు
హైదరాబాద్ : సర్కారు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. గురువారం ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. 18రోజుల్లోపు డిమాండ్లను పరిష్కరించాలని వారు గడువు పెట్టారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి వివిధ రూపల్లో నిరసనలు తెలుపుతామన్నారు.
జూన్ 2నుంచి పూర్తిస్థాయిలో వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమకు యూజీసీ స్కేల్ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు డైరెక్టర్లను నియమించాలనే ఆలోచన విరమించుకోవాలని కోరారు.