Womens Murder
-
ఇద్దరు మహిళల దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో ఘటన శామీర్‌పేట్: ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. వుల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి కథనం ప్రకారం.. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కౌకూర్ సమీపంలోని వెంకూష్ ఎస్టేట్‌లో గల నిర్మానుష్య ప్రదేశంలో శుక్రవారం ఇద్దరు వుహిళలు హత్యకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. వుృత దేహాలపై లక్ష్మి, ధనలక్ష్మి అని పచ్చబొట్లు ఉన్నాయి. హత్యకు గురైన మహిళలు ఈనెల 22న కౌకూర్ ఎంబీ దర్గా వద్దకు వచ్చి.. ఇక్కడే 15 రోజులు ఉంటామని గ్రామానికి చెందిన వుల్లయ్యు వద్ద ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. కిరారుుకి ఇచ్చే సవుయుంలో వుల్లయ్యు చిరునామా అడగ్గా.. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు లక్ష్మి చెప్పగా, తాను సూరారం నుంచి వచ్చినట్లు ధనలక్ష్మి చెప్పింది. అనంతరం వుహిళలు ఎంబీ దర్గాను సందర్శించి అక్కడ తాయత్తులు కట్టించుకున్నారు. సాయుంత్రం కల్లు తాగి గట్టిగా అరుస్తూ ఇంట్లోనే మల విసర్జన చేయడాన్ని గమనించిన మల్లయ్య.. మరుసటి రోజు వారిని గది ఖాళీ చేయించాడు. గది ఖాళీ చేసిన వారు ఎంబీ దర్గా చుట్టుపక్కల, కల్లు కాంపౌండ్ ప్రాంతాల్లో కనిపించారు. అయితే శుక్రవారం ఉదయం వెంకూష్ ఎస్టేట్‌లో గల నిర్మానుష్య ప్రదేశంలో హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్టరీ మర్డర్స్
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణం శ్రీరాంనగర్‌లో సంచలనం సృష్టించిన ముగ్గురు మహిళల హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఇప్పటికీ ఛేదించలేదు. ముగ్గురు మహిళల్లో ఒక మహిళ ఎర్రగుంట్ల మండలం గోపులాపురం వద్ద హత్యకు గురికాగా, మరో మహిళ ముద్దనూరు మండలం కమ్మవారిపల్లెలో హత్యకు గురైంది. వీరిలో ఒక మహిళను మాత్రం శ్రీరాంనగర్‌లో హత్య చేశారు. తొలుత ప్రొద్దుటూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల పోలీసులు ఉమ్మడిగా దర్యాప్తు చేశారు. హత్యకు గురైంది ప్రొద్దుటూరు వాసులే కావడంతో ఇక్కడి పోలీసుల ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాల పోలీసులు తమ పరిధిలో జరిగిన రెండు హత్య కేసులను గాలికి వదిలేసినట్టు కనిపిస్తోంది. ప్రొద్దుటూరు పోలీసులు కూడా ఆ రెండు హత్య కేసులను పట్టించుకోకపోవడంతో ఈ కేసులో దర్యాప్తు మందగించింది. హంతకులు ఎవరు..? ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌లో 2013 ఫిబ్రవరి నెలలో మహిళలు హత్యలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఫిబ్రవరి 26న శ్రీరాంనగర్‌లోని భీమునిపల్లె లక్ష్మిదేవి హత్యకు గురైంది. ఆమె గాజుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమె ఇంటి నుంచి 25న వెళ్లిపోగా 26న ఉదయం ఎర్రగుంట్ల మండలంలోని గోపులాపురం వద్ద శవమై కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాల్చారు. అలాగే ఈ హత్య జరిగిన రెండు నెలలలోపే ఏప్రిల్ 29న శ్రీరాంగనర్లోని చౌడమ్మ వీధిలో నివాసం ఉంటున్న మేరువ శారదను హత్య చేశారు. ఆమె భర్త వాసుదేవరావు వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. శారద ఇంటి దగ్గరే రేషన్(చేనేత వృత్తి) వడుకుతుంటుంది. ఆమె భర్త దుకాణం నుంచి 29న మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. భార్య ఇంట్లో లేకపోవడంతో వీధిలో గాలించాడు. కనిపించకపోవడంతో 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే రోజు ముద్దనూరు మండలం కమ్మవారిపల్లె గ్రామ సమీపంలోని రోడ్డు పక్కలో ఆమె మృతదేహం పడి ఉంది. తర్వాత అదే ఏడాది జూన్ 3న శ్రీరాంనగర్‌లో గొంటుముక్కల రంగమ్మ అనే వృద్ధురాలిని హత్య చేశారు. ఆమెను హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని సంచిలో వేసి మురికి కాలువలో పడేశారు. నీరుగారుతున్న హత్య కేసులు మహిళల హత్యలు జరిగి ఏడాదిన్నర దాటినప్పటికీ పోలీసులు మాత్రం నిందితులను గుర్తించలేకపోయారు. దీంతో తమ వారిని ఎవరు హత్య చేశారు ? ఎందుకు హత్య చేశారో తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు నాలుగైదు నెలల క్రితం వరకూ ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పుడు ఆ కేసుల గురించి పట్టించుకోకపోవడంతో ఇక ఆ కేసులను పూర్తిగా పక్కన పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకనైనా పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని ఈ హత్యల మిస్టరీని ఛేదిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
నేనే చంపేశాను..
కుల్కచర్ల,న్యూస్‌లైన్:పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైంది. ‘నేనే చంపేశాను..’ అంటూ నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన ఆదివారం కుల్కచర్ల మండల కేంద్రంలో వెలుగుచూసింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె హన్మయ్య, హన్మమ్మ(58) దంపతులు. హన్మయ్య వికలాంగుడు, దీం తో ఆయన స్థానికంగా భిక్షాటన చేస్తు ండగా హన్మమ్మ కూలిపనులు చేస్తో ంది. అదే గ్రామానికి చెందిన వడ్డె రాములుతో దంపతులకు పాత కక్షలు ఉన్నాయి. ఈక్రమంలో నాలుగురోజు ల క్రితం హన్మమ్మ, రాములు గొడవపడ్డారు. దీంతో హన్మమ్మ రాములుపై కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు రాములును అదుపులోకి తీసుకొని విచారించి శనివారం వదిలేశారు. శనివారం రాత్రి రాములు హన్మమ్మ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా ఆమె దుర్భాషలాడింది. తనపై అప్పటికే హన్మమ్మ ఠాణాలో ఫిర్యాదు చేయడం, తిరిగి దూషించడంతో రాములు తీవ్ర ఆగ్రహానికి గురయ్యా డు. అక్కడే ఉన్న ఓ రాయితో హన్మమ్మపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే ప్రాణం విడిచిం ది. ఎవరూ గమనించకపోవడంతో రా ములు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం ఉదయం స్థాని కులు హన్మ మ్మ మృతదేహంగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ నాగేష్ తమ సిబ్బం దితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడి వివరాలు సేకరణకు జాగిలాలు రప్పిం చేందుకు సిద్ధమవుతున్నారు. అంతలోనే రాములు అక్కడికి వచ్చి ‘నేనే హన్మమ్మను చంపేశాను’ అని లొంగిపోయాడు. అనంతరం పోలీసు జాగిలం కూడా రాములు వద్ద ఆగిపోయింది. హన్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాములను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈమేరకు సీఐ వేణుగోపాల్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.