ఇద్దరు మహిళల దారుణ హత్య | Brutal murder of two women | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళల దారుణ హత్య

Published Sat, Jun 25 2016 4:06 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Brutal murder of two women

రంగారెడ్డి జిల్లాలో ఘటన  
 
 శామీర్‌పేట్: ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. వుల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి కథనం ప్రకారం.. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కౌకూర్ సమీపంలోని వెంకూష్ ఎస్టేట్‌లో గల నిర్మానుష్య ప్రదేశంలో శుక్రవారం ఇద్దరు వుహిళలు హత్యకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. వుృత దేహాలపై లక్ష్మి, ధనలక్ష్మి అని పచ్చబొట్లు ఉన్నాయి.

హత్యకు గురైన మహిళలు ఈనెల 22న కౌకూర్ ఎంబీ దర్గా వద్దకు వచ్చి.. ఇక్కడే 15 రోజులు ఉంటామని గ్రామానికి చెందిన వుల్లయ్యు వద్ద ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. కిరారుుకి ఇచ్చే సవుయుంలో వుల్లయ్యు చిరునామా అడగ్గా.. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు లక్ష్మి చెప్పగా, తాను సూరారం నుంచి వచ్చినట్లు ధనలక్ష్మి చెప్పింది. అనంతరం వుహిళలు ఎంబీ దర్గాను సందర్శించి అక్కడ తాయత్తులు కట్టించుకున్నారు. సాయుంత్రం కల్లు తాగి గట్టిగా అరుస్తూ ఇంట్లోనే మల విసర్జన చేయడాన్ని గమనించిన మల్లయ్య.. మరుసటి రోజు వారిని గది ఖాళీ చేయించాడు. గది ఖాళీ చేసిన వారు ఎంబీ దర్గా చుట్టుపక్కల, కల్లు కాంపౌండ్ ప్రాంతాల్లో కనిపించారు. అయితే శుక్రవారం ఉదయం వెంకూష్ ఎస్టేట్‌లో గల నిర్మానుష్య ప్రదేశంలో హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement