World Cup Archery Stage 4
-
Archery World Cup Stage 1: భారత జట్లకు నిరాశ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత మహిళల, పురుషుల జట్లకు నిరాశ ఎదురైంది. మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడే అవకాశం లభించింది. మాడిసన్ కాక్స్, డానిలె లుట్జ్, కాసిడి కాక్స్లతో కూడిన అమెరికా జట్టు 233–225 పాయింట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె, రజత్ చౌహాన్, ప్రథమేశ్ సమాధాన్ జావ్కర్లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు రెండో రౌండ్లో 234–236 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. -
టాప్-3లో భారత్
ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్ కోల్‌కతా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-4లో స్వర్ణం సాధించిన దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకింది. గతంలో ఏడో స్థానంలో ఉన్న టీమిండియా ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకొని టాప్-3లో నిలిచింది. ఇదే టోర్నీలో రజతంతో సరిపెట్టుకున్న పురుషుల జట్టు నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. భారత్‌కు రజతం మరోవైపు చైనీస్ తైపీలో జరిగిన ఆసియా గ్రాండ్ ప్రి ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల రికర్వ్ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో సంజయ్ బోరో, ధనిరామ్, అతుల్ వర్మల బృందం 0-6తో కొరియా చేతిలో ఓటమి పాలైంది. క్వాలిఫయింగ్ రౌండ్లో ఆరో స్థానంలో నిలిచిన భారత్... ప్రిక్వార్టర్స్‌లో 6-2తో ఇరాన్‌పై; క్వార్టర్స్‌లో 5-1తో చైనీస్‌తైపీపై; సెమీస్‌లో 6-2తో జపాన్‌పై నెగ్గింది. ఈ పోటీలకు భారత ఆర్చరీ సంఘం ద్వితీయ శ్రేణి జట్టును పంపింది.