వైఎస్సార్‌సీపీ నాయకులపై జనసేన, టీడీపీ నేతల దాడి
అవనిగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నేతలపై మరోసారి దాడికి యత్నం
మోపిదేవి (అవనిగడ్డ): ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలంకలో సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు రె చ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా కిందపడేసి పిడిగుద్దులు గుద్దడమేగాక కాళ్లతో తన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌తో వచ్చిన జనసేన నాయకులు కూడా ఈ దాడులకు పాల్పడ్డారు.
మోపిదేవిలంకలో ఏజెంట్లు టీ అడగడంతో స్థానికంగా ఉండే యార్లగడ్డ అంకరాజుతో తెప్పించారు. లోపలికి వెళుతున్న అంకరాజుపై జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌తో వ చ్చిన జనసేన నాయకులు, కొందరు టీడీపీ నేతలు దాడిచేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం మోపిదేవి మండల కన్వినర్ రాజులపాటి నాగేశ్వరరావు మీద జనసేన నేతలు బల్లా సీతారాంప్రసాద్, బల్లా మునికుమారి, బల్లా దినేష్, శ్రీనివాసరావు, పవన్ తదితరులు దాడిచేసి కొట్టారు. నాగేశ్వరరావు కుమార్తె కేశాని తేజశ్రీని కిందపడేసి పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. అడ్డువ చ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావుతో పాటు రాజులపాటి సుజాత, నరసారావు, వినయ్‌బాబు, శివనాగరాజులను తీవ్రంగా కొట్టారు.
బాధిత వైఎస్సార్‌సీపీ నాయకులు మోపిదేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అవనిగడ్డ వైద్యశాలలో చేరారు. వీరికంటే ముందే.. దాడిచేసిన టీడీపీ నాయకులు ఆస్పత్రిలో చేరారు. తరువాత వైఎస్సార్‌సీపీ నాయకులు హాస్పటల్‌లో చేరగా అదే వార్డులో ఇరువర్గాలను ఉంచారు. టీడీపీ నాయకురాలు బల్లా మునికుమారిని పరామర్శించేందుకు వ చ్చిన ఆమె సోదరులు అక్కడే చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి యత్నించారు. ఎస్‌ఐ రమేష్ ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
అనంతరం ఇరువర్గాలను మచిలీపట్నం ఆస్పత్రికి పంపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జోనల్ ఇన్‌చార్జి కడవకొల్లు నరసింహారావు వైద్యశాలకు వెళ్లి వైఎస్సార్‌సీపీ నాయకులను పరామర్శించారు. ఈ దాడుల్ని ఎమ్మెల్యే సింహాద్రి తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment