‘దిమ్మదుర్తి’లో బర్డ్ ఫెస్టివల్
సంతోషం కలిగించింది
అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల నేచర్‌క్యాంపు కార్యక్రమం నాకు చాలా సంతోషం కలిగించింది. ఇక్కడ అటవీ ప్రాంతంలో ఉన్న చెరువుల పరిసరాలు, వైవిధ్యమైన పక్షులు ఆహ్లాదం పంచాయి.
– ఉషా, పర్యాటకురాలు, హైదరాబాద్
పరిసరాలు ఆకట్టుకున్నాయి
నేచర్‌క్యాంపు, బర్డ్‌వాక్ కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వరంగల్ నుండి వచ్చా. ఇక్కడి చెరువుల పరిసరాలు ఆకట్టుకున్నాయి. పక్షులు నివసించేందుకు అనువైన వాతావరణం ఉంది. పర్యాటకంగా మరింత
అభివృద్ధి చేస్తే బాగుంటుంది.– రమేశ్,
వైల్డ్‌లైఫ్ ఎన్‌జీవో సొసైటీ, వరంగల్
అవగాహన కల్పించారు
రెండు రోజుల నేచర్ క్యాంపు కార్యక్రమం చాలా ఆనందం కలిగించింది. చెరువు పరిసరాలు, పక్షులు, చెట్లరకాలపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఇక్కడి ప్రాంతం ప్రాముఖ్యతను ఇతరులకు కూడా తెలియజేస్తాం. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది.
– గుర్రం కిషోర్, పర్యాటకుడు, వరంగల్
వడ్రంగి పిట్ట
చెరువు అందాలను తిలకిస్తున్న పర్యాటకులు
మామడ(నిర్మల్): నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి అటవీ అటవీరేంజ్ పరిధిలో ఉన్న నల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తుర్కం చెరువు, పొన్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని యెంగన్న చెరువుల వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేచర్ క్యాంపు, బర్డ్ ఫెస్టివల్ కార్యక్రమాలు హైటీకోస్ బృందం పర్యాటకులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వచ్చిన పర్యాటకులు శనివారం చెరువుల వద్దకు చేరుకోగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పర్యాటకులు కవ్వాల్ అభయారణ్యం, చెరువులను సందర్శించారు. రాత్రి సమయంలో క్యాంపుఫైర్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం తుర్కం చెరువు నుంచి యెంగన్న చెరువుకు ప్రత్యేక వాహనాలలో సఫారీ నిర్వహించారు. చెరువులకు వచ్చిన పక్షుల అందాలను కెమెరాలలో బందించారు. అటవీశాఖ అధికారులు పీసీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ ఏలుసింగ్ మేరు, సీసీఎఫ్ అధికారి శరవణన్, డీఎఫ్‌వో నాగినిభాను, ఎఫ్‌డీవో భవానిశంకర్, ఎఫ్‌ఆర్‌వోలు శ్రీనివాస్‌రావు, అవినాష్, రామకృష్ణ, అనిత వారికి చెరువుల ప్రాముఖ్యత, ఈ ప్రాంతంలోకి వలస వచ్చే పక్షుల గురించి వివరించారు.
కొంగజాతి పక్షి
అటవీ ప్రాంతంలో నేచర్ క్యాంపు సందడి చేసిన పర్యాటకులు..
Comments
Please login to add a commentAdd a comment