క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Mon, Nov 25 2024 8:18 AM | Last Updated on Mon, Nov 25 2024 8:18 AM

-

కల్వర్టు పైనుంచి పడి ఒకరు..

కడెం: కల్వర్టుపై నిద్ర ఓ యువకుడిని కాటికి పంపింది. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మాసాయిపేట్‌కు చెందిన తీగల రమేశ్‌(33) కొన్నేళ్లుగా లక్ష్మణచాంద మండలంలోని చామన్‌పల్లిలో ఉంటున్నాడు. తన మేనత్త మృతి చెందిందని ఇటీవలే మాసాయిపేట్‌కు వచ్చాడు. ఈనెల 23న రాత్రి అతిగా మద్యం సేవించి గ్రామ సమీపంలోని కల్వర్టుపై పడుకున్నాడు. అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొని బాలుడు..

దహెగాం: ఐదేళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబలించింది. మండలంలోని దేవాజీగూడలో ఘటన చోటు చేసుకుంది. ఎస్సై కందూరి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాజీగూడకు చెందిన సదువుల క్రిష్ణ, వనిత దంపతుల కుమారుడు రిషాన్‌ (5) ఆదివారం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన సదువుల శ్రీనివాస్‌ ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న బాలున్ని ట్రాక్టర్‌ కబళించడంతో అయ్యో రిషాన్‌ అంటూ అక్కడున్నవారు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుని బాబాయ్‌ సదువుల ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

అనుమానాస్పదంగా యువకుడు మృతి

కడెం: మండలంలోని దత్తోజీపేట్‌ అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందినట్లు ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని అల్లంపల్లికి చెందిన కస్తూరి రమేశ్‌ (26) ఈనెల 23న కూలీ పని కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా గంగాపూర్‌ జీపీ పరిధిలోని దత్తోజీపేట్‌ అటవీ ప్రాంతంలో మృతదేహం కనిపించింది. మృతిపై విచారణ చేపట్టాలని మృతుని భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

డ్రెయినేజీలో పడి ఒకరు..

ఇంద్రవెల్లి: ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై భీంరావ్‌ తెలి పిన వివరాల ప్రకా రం దనోరా(బి) గ్రామానికి చెందిన కుంర సుభాష్‌ (48) ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. ఏఎస్సై కాత్లే భీంరావ్‌ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్‌ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌టౌన్‌(జైనథ్‌): ఈ నెల 21న పు రుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన జైనథ్‌ మండల కేంద్రానికి చెందిన జవ్వాజి సురేందర్‌ (32) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement