రాష్ట్రస్థాయి పోటీల్లో ‘స్పోర్ట్స్‌’ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో ‘స్పోర్ట్స్‌’ విద్యార్థుల ప్రతిభ

Published Mon, Nov 25 2024 8:21 AM | Last Updated on Mon, Nov 25 2024 8:21 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో ‘స్పోర్ట్స్‌’ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి పోటీల్లో ‘స్పోర్ట్స్‌’ విద్యార్థుల ప్రతిభ

ఆదిలాబాద్‌టౌన్‌: ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లోని లాలగూడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో 48–50 కిలోల విభాగంలో బి.నిఖిల్‌ బంగారు పతకం సాధించాడు. అలాగే 38–40 కిలోల విభాగంలో బి.ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం, 32–34 కిలోల విభాగంలో ప్రవణ్‌, 30–32 కిలోల విభాగంలో వెంకట వర్షిత్‌ కాంస్య పతకాలను సాధించారు. ఇందులో నిఖిల్‌ డిసెంబర్‌ 16 నుంచి 22 వరకు ఢిల్లీలోని ఛత్రుశాల స్టేడియంలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు గాను రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.

పతకాలు సాధించిన స్పోర్ట్స్‌

స్కూల్‌ విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement