ఆహార పదార్థాలు క్షుణ్ణంగా పరిశీలించాలి
● కలెక్టర్ రాజర్షిషా ● గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమీక్ష
ప్రతీవారం తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలి
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు, ఆస్పత్రులను ప్రతీవారం తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఆహార భద్రతా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ఆయా శాఖల అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాలలు, వసతిగృహాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, తదితర సంస్థల్లో ఆహారాన్ని అందించేందుకు ప్రమాణాలతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే మల్టీ డిసిప్లనరీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి గడిచిన రెండేళ్లలో ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరిగిన హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాలని, దానికి గల కారణాలు, సమస్యలకు పరిష్కారాలు చూపాలని సూచించారు. ఏఎన్‌ఎం, హెడ్‌కుక్, టీచర్లకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతీ పాఠశాలలో ఒక టీచర్‌తో పాటు ఇద్దరు విద్యార్థులను లీడర్లుగా నియమించాలని సూచించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కై లాస్‌నగర్: మండల ప్రత్యేక అధికారులు వారంలో రెండుసార్లు వసతిగృహాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలతో భో జనం చే యాలని, అలాగే వంట చేసే ముందు ఆ హార ప దార్థాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ నుంచి బుధవారం గూగుల్‌మీట్ ద్వారా అధికారులకు దిశా నిర్దే శం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షి యల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అ ల్పాహారం కలుషితం కాకుండా త గు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డిసెంబర్ 7 నుంచి సీఎం కప్ పోటీలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతి భను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథా రిటీ తెలంగాణ ఆధ్వర్యంలో నాలుగు దశల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డి సెంబర్ 7, 8న పంచా యితీ స్థాయిలో, 10 నుంచి 13 వరకు మండలాల్లో, 16 నుంచి 21 వరకు జి ల్లా స్థాయిలో పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజాపాలన విజయోత్సవాలను డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాలో నిర్వహించాలని, ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వన్ ఇయర్ లోగోను అన్ని శాఖల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఈవో ప్రణీత, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment