సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘గులాబీ’ పార్టీ మళ్లీ ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కోలుకోలేని దెబ్బతిన్న బీఆర్‌ఎస్ పార్టీ కేడర్ కొంతకాలంగా గడ్డు పరిస్థితి ఎదుర్కోంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నుంచే అనేక మంది కీలక నేతలు పార్టీ మారారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా అనేక మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీలు అధికా ర పార్టీ గూటికి చేరారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి మాత్రమే పార్టీ ఎమ్మెల్యేలు ప్రా తినిధ్యం వహిస్తున్నారు. మిగతా చోట్ల మాజీ ప్ర జాప్రతినిధులు ఉన్నప్పటికీ అందరూ ఎక్కువగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. పార్టీని మళ్లీ బలో పేతం చేయాలనే ఆదేశాలు అధిష్టానం నుంచి రావడంతో అందరూ క్రియాశీలకంగా మారుతున్నారు.
బలోపేతానికి ఆరాటం
గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తిరిగి జోష్ నింపేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇప్పటికే రైతుల పంట రుణ మాఫీతో సహా పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్ పార్టీ రోడ్లపైకి వచ్చిన నిరసనలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రో జును పురస్కరించుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో ‘దీక్షా దివస్’ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావస్తోంది. ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాలు త దితర విజయాలపై ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పరంగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హో దాలో గత ఏడాదిలో జరిగిన సర్కారు తీరుపై పో రాటం చేసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఇక నుంచి క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ప్ర ణాళిక రచించారు. అంతేగాక పార్టీ సంస్థాగతంగా ఎక్కడైనా పదవులు ఖాళీగా ఉంటే వెంటనే నియామకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment