బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్‌టౌన్: బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివా హరహిత భారతదేశం అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. చిన్న వయస్సులో వివాహంతో అనా రోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపా రు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తే కేసులు తప్పవన్నారు. ఇందులో జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, సైబర్‌క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా ఖాన్, రియాజ్, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ యశోద, గోపాల్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment