నాణ్యమైన భోజనం అందించాలి
నేరడిగొండ: ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టోర్‌రూమ్‌లో సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రత్యేక అధికారి రజితను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట కేజీబీవీ ప్రత్యేక అధికారి రజిత, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.
సర్వే వివరాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి
సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆన్‌లైన్ నమోదు డిసెంబర్ 1వరకు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నేరడిగొండ ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని ఆపరేటర్లకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కలీమ్, ఎంపీడీవో రాజ్‌వీర్, ఎంపీవో లక్ష్మణ్, ఈజీఎస్ ఏపీవో వసంత్‌రావు, ఆపరేటర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
● కలెక్టర్ రాజర్షిషా
Comments
Please login to add a commentAdd a comment