ముగిసిన ప్రత్యేక ఓటరు నమోదు
● జిల్లాలో 793 దరఖాస్తులు
కై లాస్‌నగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2025లో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. జిల్లాలోని 592 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, సవరణల కోసం పలువురు నిర్దేశిత ఫారాలను సమర్పించారు. ఈ పక్రియను తహసీల్దార్లు, ఆర్‌ఐలు పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఓటరు నమోదు కోసం 793 దరఖాస్తులు రాగా, ఓటరు జాబితా నుంచి తొలగింపు కోసం 75 దరఖాస్తులు అందాయి. అలాగే మార్పులు, చేర్పులకోసం 415 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు రాథోడ్ పంచపూల తెలిపారు. వీటిపై ఈ నెల 28వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. వాటిని పరిష్కరించిన అనంతరం ఓటరు తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 6న ప్రకటించనున్నట్లుగా ఆమె వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment