మెనూ ప్రకారం భోజనం పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

Published Fri, Nov 29 2024 1:58 AM | Last Updated on Fri, Nov 29 2024 1:58 AM

మెనూ

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

ఎఫెక్ట్‌..

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో ప్రణిత సూచించారు. ఈనెల 27న ‘మధ్యాహ్నం.. అధ్వానం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆమె గురువారం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ఆర్పీఎల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పిట్టల్‌వాడలోని ఉర్దూ మీడియం, హమీద్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలతో పాటు పలు పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కిచెన్‌తో పాటు సరుకులు, పాత్రలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని, ముందుగా భోజనం తిని ఆ తర్వాతే విద్యార్థులకు పెట్టాలని ఆదేశించారు. ఆమె వెంట సెక్టోరియల్‌ అధికారి నారాయణ, ప్రధానోపాధ్యాయులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి1
1/1

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement