● పెరగని తెల్లబంగారం ధర ● విదేశాలకు ఎగుమతి లేకే.. ● రంగ
సాక్షి, ఆదిలాబాద్: తెల్లబంగారం రైతుల ఆశలను వమ్ము చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో మంచి ధర పలుకుతుందని ఆశించిన వీరికి చుక్కెదురవుతోంది. రెండేళ్ల కిందట క్వింటాల్‌కు రూ.10వేల వర కు ఎగబాకింది. గతేడాది ఆ పరిస్థితి లేనప్పటికీ మ ళ్లీ ఈసారి అలాంటి ధరే లభిస్తుందని ఆశపడ్డ రైత న్న భంగపడ్డాడు. కొనుగోళ్లు ప్రారంభమై నైలెనా అంతటి ధర వచ్చే పరిస్థితులు కనబడటం లేదు.
25న కొనుగోళ్లు ప్రారంభమైనా..
జిల్లాలో పత్తి కొనుగోళ్లు అక్టోబర్ 25న మొదలయ్యాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 ఉండగా, మొదటిరోజు మార్కెట్‌లో ప్రైవేట్ వ్యాపారులు రూ.7,150 ధర చెల్లించారు. మొదట్లో పత్తిలో తేమ అధికంగా ఉందనే కారణంగా సీసీఐ కొనుగోళ్లు నామమాత్రంగా చేపట్టింది. ఆ పరిస్థితుల్లో రైతులకు ప్రైవేట్ వ్యాపారులే దిక్కయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న వారు తేమ సాకును చూపెడుతూ క్వింటాల్‌కు రూ.6,600 వరకు మాత్రమే చెల్లించారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌తోపాటు ధర పెరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పటివరకు నిరాశే మిగిలింది. ప్రైవేట్‌లో ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.7వేలు మాత్రమే ధర పలుకుతోంది.
అత్యధికంగా సీసీఐ కొనుగోళ్లు
ప్రస్తుతం పత్తిలో తేమ శాతం అంతగా రాకపోవడంతో మెజార్టీ రైతులకు మద్దతు ధర దక్కుతోంది. భా రత పత్తి సంస్థ (సీసీఐ)కే రైతులు పత్తిని విక్రయిస్తున్నారు. క్వింటాల్‌కు రూ.7,521 ధర పొందుతున్నా రు. కొంత మంది రైతులు తేమ శాతం తక్కువగా ఉండడంతో ప్రీమియం ఇన్సెంటివ్ కూడా పొందుతున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లో పత్తి ధర పెరిగితే రైతుకు లాభం చేకూరే పరిస్థితులున్నాయి.
జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా..
వానాకాలంలో 4,21,815 ఎకరాల్లో పత్తి సాగైంది. జిల్లాలో ఈ ఏడాది 25లక్షల నుంచి 30 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో ఇప్పటివరకు 7లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి క్రయ, విక్రయాలు జరి గాయి. బహిరంగ మార్కెట్‌లో ధర పెరగవచ్చని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
పత్తి విక్రయాల వివరాలు ఇలా..
ఇప్పటివరకు విక్రయించింది :
7,20,419 క్వింటాళ్లు
విక్రయించిన రైతుల సంఖ్య :
35,922 మంది
సీసీఐ కొనుగోలు చేసింది :
5,99,651 క్వింటాళ్లు
వ్యాపారులు కొనుగోలు చేసింది : 1,20,768 క్వింటాళ్లు
ఎగుమతుల డిమాండ్ లేదు
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం పత్తి బేల్ ధర రూ.54వేలు పలుకుతోంది. రూ.62వేల నుంచి పడిపోతూ ప్రస్తుతం ఈ ధర ఉంది. సీడ్ ధర రూ.3,200 పలుకుతోంది. దీని ధర కూడా రూ.3,800 నుంచి దిగుతూ వచ్చింది. మళ్లీ ఈ ధరలు పెరిగితేనే మార్కెట్‌లో పత్తికి డిమాండ్ ఉంటుంది. మనదేశం నుంచి వివిధ దేశాలకు పత్తి ఎగుమతులకు డిమాండ్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది.
– రాజు చింతవార్, ఆగ్రో ఇండస్ట్రీస్
అసోసియేషన్ అధ్యక్షుడు, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment