పత్తి కొనుగోళ్లు నిలిపివేత
బోథ్: బోథ్ మార్కెట్‌యార్డు పరిధిలోని సొ నాలలోని గురుసాహెబ్ చందా కాటన్ ఇండస్ట్రీస్ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో శు క్రవారం నుంచి డిసెంబర్ 1 వరకు కొనుగో ళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మా ర్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి విఠల్ ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి నిల్వలు పేరుకుపోవడంతో నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నా రు. 2న కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు.
భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామ రైతు ఏడపెల్లి రమేశ్ (50) 2023లో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేశాడు. పెట్టుబడి కోసం రూ.6.50లక్షల అప్పు చేశాడు. గతేడాది వానలు అధికంగా కురవడంతో దిగుబడి రాలేదు. గిట్టుబాటు ధర రాక కౌలు ఎలా చెల్లించేదని మనోవేదనకు గురయ్యాడు. గత జనవరి 1న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కౌలు రైతు కావడంతో అతడి కుటుంబానికి రైతుబీమా కూడా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment