నాణ్యమైన భోజనం అందించాలి
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డీఈవో ప్రణీత నిర్వాహకులను ఆదేశించారు. ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఆదివారం వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. అనంతరం విజేతలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో డైట్ వైస్ ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, ఆదిలాబాద్రూరల్ ఎంఈవో నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment