లక్ష్యం @ 27.87లక్షలు
వన మహోత్సవ
● మొక్కల పెంపకానికి సర్కారు కసరత్తు ● మండలాల వారీగా లక్ష్యం ఖరారు
కై లాస్‌నగర్: జిల్లాలో 2025 సంవత్సరంలో చేపట్టనున్న వన మహోత్సవానికి యంత్రాంగం సమాయత్తమవుతోంది. గ్రామీణ మండలాలు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో లక్ష్యాలకు అనుగుణంగా మొక్కల పెంపకం దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను అధికారులు ఖరారు చేశారు. తదనుగుణంగా వ చ్చే జూన్, జూలైలో అందించాల్సిన మొక్కల పెంపకంపై దృష్టి సారించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ దిశగా తగు చర్యలు తీసుకుంటున్నారు. అయితే మొక్కల పెంపకం, సంరక్షణలో ఉపాధి హామీ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరువైన క్షేత్రస్థాయి పరిశీలన..
రానున్న వర్షాకాలంలో నిర్వహించే వన మహోత్సవానికి అవసరమైన మొక్కలు అందించేందుకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నర్సరీలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు 18 మండలాలకు లక్ష్యాలను నిర్దేశించారు. గతేడాది నిర్వహించిన నర్సరీల్లో 50 శాతం మొక్కలు కూడా సరఫరా చేయలేకపోవడంతో ఈఏడాది ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే డీఆర్డీఏ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు.
నిబంధనలు గాలికి..
వన మహోత్సవానికి అవసరమైన మొక్కలు అందించాలంటే గ్రామీణ ప్రాంతాల్లోని నర్సరీల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొక్కలతో పాటు సేంద్రియ ఎరువుతో కూడిన మట్టిని బ్యాగుల్లో నింపాలి. అలాగే గ్రీన్ మ్యాట్‌తో కూడిన షెడ్‌లు ఏర్పాటు చేయాలి. అయితే జిల్లాలో ఇలాంటి నిబంధనలేమి పాటించడం లేదు. వీటిని పర్యవేక్షించాల్సిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ అధికారి ఏ మండలంలోనూ పర్యటించిన దాఖలాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు చేపడితే లక్ష్యం మేరకు మొక్కలు అందే అవకాశం ఉంటుంది.
మండలం గ్రామ నాటాల్సిన
పంచాయతీలు మొక్కల లక్ష్యం
ఆదిలాబాద్‌రూరల్ 34 2లక్షలు
బజార్‌హత్నూర్ 30 1.70లక్షలు
బేల 37 2లక్షలు
భీంపూర్ 26 1.50లక్షలు
బోథ్ 33 2లక్షలు
గుడిహత్నూర్ 26 1.60లక్షలు
గాదిగూడ 25 1లక్ష 50వేలు
ఇచ్చోడ 32 2 లక్షలు
ఇంద్రవెల్లి 28 2 లక్షలు
జైనథ్ 42 2.1లక్షలు
మావల 03 20 వేలు
నార్నూర్ 23 1.50లక్షలు
నేరడిగొండ 32 1.7లక్షలు
సిరికొండ 19 1.10లక్షలు
తలమడుగు 28 1.65లక్షలు
తాంసి 13 80 వేలు
ఉట్నూర్ 37 2.52లక్షలు
Comments
Please login to add a commentAdd a comment