చలి గుప్పిట్లో..
ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంలో వేకువజామున కమ్ముకున్న పొగమంచు
జిల్లాలో చలి పంజా విసురుతోంది. రెండు, మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రి శీతల గాలులు వీస్తుండగా వేకువజామున పొగమంచు కమ్మేస్తోంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ ప్రభావం మరింత అధికం. సాయంత్రం ఆరు దాటిందంటే జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో ఉపశమనం కోసం జనం చలిమంటలు కాగుతున్నారు. జిల్లాలో ఆదివారం బజార్‌హత్నూర్
మండలంలో 10.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. – ఆదిలాబాద్‌టౌన్/ఉట్నూర్‌రూరల్
Comments
Please login to add a commentAdd a comment