ఆదిలాబాద్టౌన్: నేషనల్ మీన్స్ కమ్ మెరి ట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఆది వారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన కేంద్రంలో 234 మందికి గాను 218 మంది హాజరయ్యారు. గెజిటెడ్ నం.1 పరీక్ష కేంద్రంలో 237 మందికి గాను ఏడుగురు గైర్హాజరయ్యా రు. ప్రభుత్వ పాఠశాల నం.2లో 233 మందికి గాను 222 మంది హాజరు కాగా, బాల క్ మందిర్ పాఠశాలలో 159 మందికి గాను ఆరుగురు గైర్హాజరైనట్లు డీఈవో ప్రణీత, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 863 మంది హాజరు కావాల్సి ఉండగా, 823 హాజరైనట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment