ఉద్యోగుల్లో నిరాశ
● రెండు శాఖలకే పరిమితమైన అవార్డులు
కై లాస్‌నగర్: ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలందించిన, అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులను గుర్తించి వారికి గణతంత్ర, స్వాతంత్య్ర దినో త్సం రోజున ప్రశంస పత్రాలను అందజేసి స త్కరించడం అనవాయితీగా వస్తోంది. అయితే ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మై దానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఈ అవార్డులు పోలీస్, రవాణా శాఖలకు మాత్రమే పరిమితమయ్యాయి. రవాణాశాఖలో కేవలం ఒక్క అధికారికే దక్కింది. అయితే ఇతర శాఖల ఉద్యోగులను విస్మరించడంపై అధికారవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వేడుకలు పురస్కరించుకుని జిల్లా సమాచార శాఖ ద్వారా మీ డియాకు పంపించిన ఆహ్వాన పత్రాల్లోనూ ఉ త్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఏటా మాదిరిగానే అన్ని శాఖల నుంచి ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బంది వివరాలు సైతం స్వీకరించారు. ఆయా జాబితాల్లో పేర్లు కలిగిన వారు తమకు అవార్డు వస్తుందనే ఆనందంతో పరేడ్‌గ్రౌండ్‌కు తరలివచ్చారు. అయితే కేవలం పోలీస్‌శాఖ అధికారులు, కానిస్టేబుళ్లకు మాత్రమే అవార్డులు అందజేసిన అధికారులు ఇతర ప్రభుత్వశాఖల ఊసే ఎత్తలేదు. దీంతో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై కలెక్టరేట్ ఏవో బడాల రాంరెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, గ్రామ సభల్లో యంత్రాంగమంతా బీజీగా ఉన్నందునే ఉద్యోగులకు అవార్డులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎంపికై న ఉద్యోగులకు ఎప్పుడు ఇస్తారని అడుగగా ఆ విషయంపై తనకేమి స్పష్టత లేదని పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment