బాలాజీ మందిర్‌లో చోరీ
భైంసాటౌన్: పట్టణంలోని భైంసా–నిర్మల్ జాతీయ రహదారి పక్కన, కై లాష్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో గల బాలాజీ మందిర్‌లో చోరీ జరిగింది. ఆదివారం ఉదయం ఆలయానికి నిర్వాహకులు చేరుకోగా, తాళం పగులగొట్టి తలుపు తెరిచి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా, ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీఐ గోపినాథ్ ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. స్వామివారి కిరీటం, రెండు గ్రాముల బంగారం వస్తువులు, శఠగోపం చోరీకి గురైనట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హిందూవాహిని మహిష నాయకులు మహేశ్, రాము, కౌన్సిలర్ గౌతంపింగ్లే చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. ఆలయాల్లో చోరీ ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment