ఏసీబీకి చిక్కిన పశువైద్యాధికారి
ఉట్నూర్‌రూరల్: మండలంలోని శ్యాంపూర్‌కు చెందిన పశువైద్యాధికారి రమేశ్ రాథోడ్ బుధవారం రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. శ్యాంపూర్‌లోని వెటర్నరీ ఆస్పత్రిలో రమేశ్ రాథోడ్ వైద్యాధికారిగా పనిచేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సహోద్యోగి జుగ్నాక మాదవ్‌రావు ఇటీవల నార్నూర్ మండలానికి బదిలీ అయ్యాడు. దీంతో సదరు ఉద్యోగి రెండు నెలలకు సంబంధించిన వేతన బకాయిలు, డ్యూటీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేశాడు. ఎంత బతిమాలినా ఇవ్వక పోవడంతో చివరకు రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఆస్పత్రిలో బాధితుడి కుమారుడి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment