ఆమె ప్రగతికి చేయూత
సభ్యుల ఎంపికకు కసరత్తు
ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన సిమెంట్ ఇటుకల తయారీని స్వయం సహాయక సంఘాల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా మండలానికి మూడు చొప్పున జిల్లాలో 51 యూని ట్లను ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నాం. ఆసక్తి గల సంఘాల సభ్యులను గుర్తించే దిశగా మండలాల వారీగా కసరత్తు చేస్తున్నాం. ఎంపిక చేశాక వారికి ప్రత్యేక శిక్షణతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసేలా చర్యలు చేపడుతాం. అలాగే యూ నిట్లను ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రా రంభిస్తాం. వీటి ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఆర్థిక లబ్ధితో పాటు ఇళ్లకు ఇటుకల కొరత లేకుండా ఉంటుంది.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
మండలానికి మూడు యూనిట్లు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో మండలంలో మూడు యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 51 యూని ట్లు ప్రారంభించేలా కసరత్తు చేపట్టారు. ఒక్కో యూనిట్ స్థాపనకు రూ.18లక్షల వ్యయం అ య్యే అవకాశమున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఇటుకలు తయారు చేసే మిషన్‌కు రూ.6లక్షలు, ప్లాట్ ఫాం, చిన్నపాటి షెడ్డు, విద్యుత్, నీటి వసతికి రూ.6లక్షలు, అలాగే ఇటుకలు సరఫరా చేసేందుకు మినీట్రక్కు మరో రూ.6లక్షల చొప్పున అవసరమవుతాయని ప్రభుత్వం గుర్తించింది. ఆ దిశగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణంగా మంజూరు చేయనున్నారు. ఇందులో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీం ద్వారా రూ.5లక్షల సబ్సిడీ అందనుంది. ఒక్కో యూనిట్ ద్వారా రోజుకు 22వేల ఇటుకలను తయారీ చేయవచ్చని భావిస్తున్నారు. ఇలా రోజుకు మూడు ఇళ్లకు, నెలకు 75 ఇళ్లకు సరిపడా ఇటుకులను తయారు చేసే సామర్థ్యంతో ఇటుకలను ఉత్పత్తి చేసేలా యూనిట్లను ప్రారంభిస్తున్నారు. ఒక్కో యూని ట్ను 8నుంచి 10 మంది సభ్యులు నిర్వహించేలా మంజూరు చేయనున్నారు. పెట్టుబడి, తయా రీ, వడ్డీ వంటి ఖర్చులన్నీ పోనూ ఒక్కో ఇటుకకు రూ.2 చొప్పున మూడేళ్లలో రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment