అనుమతి లేనిచోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు
ఆదిలాబాద్‌టౌన్: అనుమతి లేనిచోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప లు ముఖ్య కూడళ్లలో బుధవారం హెచ్చరిక బో ర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, కొందరు రాజకీయ, వివి ధ సంఘాల నాయకులు ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తుండడంతో రో డ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపా రు. మున్సిపల్ అధికారులతో కలిసి ఆయా ప్ర దేశాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. హెచ్చరి క బోర్డులు ఉన్నచోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment