కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 13 అంశాల్లో స్వయం ఉపాధి కల్పించే దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. తాజాగా ఇటుకల తయారీ బాధ్యతలనూ వారికి అప్పగిస్తోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండటంతో అందుకు అవసరమైన సిమెంట్ ఇటుకలు సరఫరా చేసేలా తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో 51 యూనిట్లను ఏర్పాటు చేయాలని గ్రా మీణాభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులు ఆసక్తి గల స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. సంఘాల ఎంపిక అనంతరం వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇటుకల తయారీని ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు.
కొరతను అరికట్టేలా..
పేదల సొంతింటి కల సాకారం చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని సంకల్పించింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో 7వేలు, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున నాలుగు మండలాల్లో మరో 400 కలిపి మొత్తం 7,400 ఇళ్లను తొలి విడతలో నిర్మించేలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. నిర్మాణాలు ప్రారంభమైతే ఇటుక, సిమెంట్, ఇసుక కొరత ఏర్పడే అవకాశముందని భావించిన ప్రభుత్వం దాన్ని అధిగమించేలా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇటుకల కొరత ఏర్పడి, మార్కెట్‌లో వాటి ధర పెరిగే అవకాశమున్నందున స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన సిమెంట్(ఫ్లైయాస్‌తో కూడిన) ఇటుకల తయారీ చేపట్టాలని నిర్ణయించారు. తద్వారా వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరడంతో పాటు నిర్మాణ సామగ్రి కొరతను సైతం అధిగమించవచ్చని భావిస్తున్నారు.
సిమెంట్ ఇటుకలు తయారీ చేస్తున్న యంత్రం (ఫైల్)
జిల్లాలో..
మండలాలు 17
స్వయం సహాయక సంఘాలు 1,176
స్వయం సహాయక
సంఘాల్లోని సభ్యులు 1,19,664
Comments
Please login to add a commentAdd a comment