● విడుదలైన షెడ్యూల్ ● పట్టభద్రులు, టీచర్ల స్థానానికి ఎ
షెడ్యూల్ ఇలా..
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్
ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు
నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 27న పోలింగ్
మార్చి 3న ఓట్ల లెక్కింపు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది.మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆది లాబాద్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యా య, పట్టభద్రుల ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా బరిలో నిలిచే అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలతో ఓటర్లకు దగ్గరవుతున్నారు. సమావేశాలు, సదస్సులు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్నారు. సొంతంగా మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తృతంగా ఉండడంతో ఇప్పటికే ఓ మారు చుట్టేసి వచ్చారు. ఓటర్లను కలుస్తూ మద్దతుకోరుతున్నారు.
పోటీలో అనేక మంది
ఉపాధ్యాయ, విద్యారంగ ప్రముఖులు, ప్రభుత్వ ఉ ద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రొఫెసర్లు, పలు సంఘాల నాయకులు పోటీలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటివరకు అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానం నుంచి సంగా రెడ్డి జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకుడు అంజిరెడ్డి ని ప్రకటించగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమురయ్యను ప్రకటించింది. మిగతా ప్రధాన పార్టీలేవి ఇంకా అభ్యర్థు ల పేర్లు అధికారికంగా వెల్లడించలేదు. మంచిర్యాల జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల నాయకుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ చాప్టర్ మాజీ అధ్యక్షుడు బీఎన్‌రావు, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి పలువురు పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరు ఆయా పార్టీల నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీరే కాకుండా స్వతంత్రంగా పలువురు యువకులు బరిలో ఉండేందుకు ఆరాట పడుతున్నారు.
అమల్లోకి కోడ్
ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తు న్న పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఉపాధ్యా య ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీ కాలం మార్చి 29న పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఆ లోపు ఎన్నిక నిర్వహించేందుకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఓటింగ్, ఓట్ల లెక్కింపుపై షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో ఎన్నికల కోడ్ తక్షణం అమలు కానుంది. ఫలితంగా సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ పడనుంది. ఇప్పటికే ఓటరు జాబి తా సిద్ధం కాగా, ఎన్నికల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ఆ మేరకు అంతా సిద్ధం చేసింది.
పట్టభద్ర ఓటర్లు
జిల్లా పురుషులు సీ్త్రలు మొత్తం
ఆసిఫాబాద్ 4,106 1,749 5,855
మంచిర్యాల 18,882 11,606 30,488
ఆదిలాబాద్ 10,104 4,482 14,586
నిర్మల్ 11,271 5,538 16,809
ఉపాధ్యాయ ఓటర్లు
జిల్లా పురుషులు సీ్త్రలు మొత్తం
ఆసిఫాబాద్ 314 143 457
మంచిర్యాల 940 610 1,550
ఆదిలాబాద్ 1,073 488 1,561
నిర్మల్ 1,263 681 1,944
Comments
Please login to add a commentAdd a comment