సాక్షి,పాడేరు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలన్నీ రెండు రోజులుగా సందడిగా మారాయి. పాడేరు ప్రాంతంలోని వంజంగి హిల్స్‌కు భారీగా తరలివచ్చిన పర్యాటకులు సూర్యోదయం, పొగమంచు, మేఘాల అందాలను వీక్షించారు.
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయకు పర్యాటకులు పోటెత్తారు. రెండవ శనివారం, ఆదివారం కావడంతో భారీగా తరలివచ్చారు. పద్మాపురం ఉద్యానవనాన్ని శనివారం 800 మంది సందర్శించగా రూ.47,400, ఆదివారం 1850 మంది సందర్శించగా రూ.1.06 లక్షల ఆదాయం వచ్చింది. గిరిజన మ్యూజియంను శనివారం 2,409 మంది సందర్శింగా రూ.1,92,495, ఆదివారం 2,800 మంది సందర్శించగా రూ.1,91,800 ప్రవేశ రుసుం ద్వారా ఆదాయం సమకూరింది.
కూనవరం: పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. శనివారం 784 మంది, ఆదివారం 687 మంది బోట్లలో తరలివెళ్లారు. వర్షాలు, వరదలు, తుపానుల కారణంగా గత మూడు నెలల పాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర, దసరా సెలవుల అనంతరం ఊపందుకుంది.
డుంబ్రిగుడ: పర్యాటకుల రాకతో చాపరాయి జలవిహారి సందడిగా మారింది. ఆంజోడలోని అరకు పైనరీకి ఆదవారం భారీగా తరలివచ్చారు. దీంతో అరకు–జైపూర్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ నెలకొంది.డుంబ్రిగుడ–కించుమండ మధ్యలోని బిల్లాపుట్టు వద్ద మేఘాల కొండపై పర్యాటకులతో సందడి నెలకొంది.
చింతపల్లి: లంబసింగికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. చెరువుల వేనం వ్యూపాయింట్ వద్ద పాల సముద్రాన్ని తలిపించే మంచు అందాలను తిలకించారు. తాజంగి జలాశయం వద్ద బోటు షికారు చేశారు. జిప్‌లైన్ ఎక్కి సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment