మంచి సేయనోడు.. మతలబులు సేత్తన్నాడు | Sakshi
Sakshi News home page

మంచి సేయనోడు.. మతలబులు సేత్తన్నాడు

Published Mon, May 6 2024 9:30 AM

మంచి

బాబు దాష్టీకాలపై సామాన్య జనం మండిపాటు

రచ్చబండ వేదికగా జగన్‌ పాలనను నెమరువేసుకుని మురిసిన పండుటాకులు

బాబు రాజకీయాలతో తమ బతుకులు ఇబ్బందుల్లో పడ్డాయని ఆవేదన

అచ్యుతాపురం: ఏటో ఈ రాజకీయాలు.. సుఖానున్న పేణాన్ని కట్టాల్లోకి నెట్టేసాయి. పించినీ కోసం గొర్రె ల్నాగా ఉరకాల్సి వత్తాంది.. జగన్‌బాబు మాటిత్తే తప్పడు కదా.. మన పాస్‌ పుస్తకాల మీద ఆయన ఫొటో ఉంటే భూముల్ని లాక్కుంటాడా? జనం అంత అమాయకులా? సర్వే చేసి భూముల సరిహద్దులు చూపించినారు కదా! మరెందుకు ఇలా పెచారం సేత్తన్నారు? రెండు నెలల నుంచి ఏటీ పుర్రాకులు.. వోలింటీర్లు సక్కగా ఇంటికాడికొచ్చి పించినీలు ఇచ్చేవారు. ఇప్పుడేమో బ్యాంకుల సుట్టూ తిరగాల్సి వత్తాంది. జగన్‌బాబు వచ్చిన కాడి నుంచి అన్ని పనులు జరుగుతున్నాయి..’ అంటూ సీఎం జగన్‌ 59 నెలల పాలనపై జనం చర్చించుకుంటున్నారు. మునగపాక మండల కేంద్రంలో రచ్చబండ వద్ద వృద్ధులు, స్థానికులు జగన్‌ పాలనపై వారి అభిప్రాయాలు చెప్పుకున్నారు. పాసు పుస్తకాలపై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, మన భూముల్ని సీఎం ఎందుకు లాక్కుంటారని పలువురు ప్రశ్నించారు. ఇంటి వద్దకే పింఛన్‌ వచ్చేదని, వలంటీర్లు పింఛన్లు అందించే వారని మరికొందరు ప్రశంసించారు. ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు ఎలాంటి వివక్ష లేకుండా అందించారని పేర్కొన్నారు. ఇప్పుడు పింఛన్ల కోసం సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వాపోయారు. ఇది కేవలం రాజకీయం కోసమే చేశారని నిట్టూర్చారు. జగన్‌ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నామని రచ్చబండలో వృద్ధులు, స్థానికులు చెప్పిన అభిప్రాయాలు..

మంచి సేయనోడు.. మతలబులు సేత్తన్నాడు
1/1

మంచి సేయనోడు.. మతలబులు సేత్తన్నాడు

Advertisement
Advertisement