No Headline - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Jun 15 2024 1:24 AM

No Headline

తుమ్మపాల: సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి శాంతిప్రభ అన్నారు. మండలంలో తగరంపూడి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల ఓపీ వివరాల ప్రకారం వారికి అందిస్తున్న వైద్యసేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు. ఫార్మసీ, స్టోర్స్‌, కోల్డ్‌ చైన్‌రూమ్‌, ఓటీ రూమ్‌, వార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు, అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో బి.తిరుపతిరావు, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement