‘స్కిల్‌’ఇన్‌స్టిట్యూట్‌తో ఏపీ చాంబర్స్‌ ఎంవోయూ - | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ఇన్‌స్టిట్యూట్‌తో ఏపీ చాంబర్స్‌ ఎంవోయూ

Published Sun, Jun 16 2024 1:16 AM

-

ఎంవీపీకాలనీ(విశాఖ): నగరంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఏపీ చాంబర్స్‌ విశాఖపట్నం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరుసంస్థల ప్రతినిధులు ఎంవీపీకాలనీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఎంవోయూలో భాగంగా విద్యార్థులు, ట్రైనీల్లో నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఏపీ చాంబర్స్‌ సేవలందిస్తుంది. ఏపీ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ తన సభ్య పరిశ్రమల ద్వారా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లు, పలు కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వనుంది. ఎస్‌డీఐ సీఈవో ఇంతియాజ్‌ అర్షద్‌, ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ విశాఖ జోన్‌ చైర్మన్‌ శ్రీనాథ్‌ చిట్టూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement