పలు రైళ్ల రద్దు, మరికొన్ని రీ షెడ్యూల్‌ - | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల రద్దు, మరికొన్ని రీ షెడ్యూల్‌

Published Sun, Jun 16 2024 1:18 AM

-

తాటిచెట్లపాలెం(విశాఖ): ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ పూండి–పలాస మెయిన్‌ లైన్‌, కోటబొమ్మాళి –తిలారు మధ్య జరుగుతున్న పనుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సందీప్‌ తెలిపారు. ఈ నెల 17వ తేదీన పలాస–విశాఖపట్నం (07471) పాసింజర్‌, విశాఖ పట్నం–పలాస(07471) పాసింజర్‌, విశాఖపట్నం –గుణుపూర్‌(08522) పాసింజర్‌, గుణుపూర్‌–విశాఖపట్నం(08521) పాసింజర్‌, విశాఖపట్నం–బ్రహ్మపూర్‌(18526) ఎక్స్‌ప్రెస్‌ రద్దయ్యాయి. ఈ నెల 18వ తేదీన బ్రహ్మపూర్‌–విశాఖపట్నం(18525) ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు.

రీ షెడ్యూల్‌ చేసిన రైళ్లు

● సికింద్రాబాద్‌లో సోమవారం తెల్లవారు 4.30 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్‌– షాలిమర్‌ (07225) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 2 గంటలు ఆలస్యంగా ఉదయం 6.30గంటలకు బయల్దేరుతుంది.

● సికింద్రాబాద్‌లో ఆదివారం రాత్రి 11.40 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్‌– సంత్రగచ్చి (07234) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 గంటలు ఆలస్యంగా సోమవారం తెల్లవారు 3.40 గంటలకు బయల్దేరుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement