పశువుల రక్షణకు ఆరోగ్య శిబిరాల ఏర్పాటు
● రాష్ట్ర పశు సంవర్ధకశాఖ ఏడీ డా.చిన్నయ్య
చిననందిపల్లిలో పశు ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న డా.చిన్నయ్య
దేవరాపల్లి: పశువుల రక్షణకు ఆరోగ్య శిబినాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్ ఆర్.చిన్నయ్య తెలిపారు. చిననందిపల్లిలో మంగళవారం నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు మందులు, సమీకృత దాణాను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 25 వేల గోకులం షెడ్లు మంజూరు చేశామని, అదనంగా మరో 25 వేల గోకులం షెడ్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో 230 పశువులు చనిపోగా 173 పశువులకు రూ. 52.5 లక్షల బీమా సొమ్మును రైతులకు చెల్లించామన్నారు. జిల్లా పశువైద్యాధికారి డా.బి.మోహన్‌రావు, డివిజినల్ డిప్యూటీ డైరెక్టర్ డా.ఎం.చంద్రశేఖర్, కె.కోటపాడు ఏడీ ఇ.దినేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment