నయవంచన.. నమ్మక ద్రోహం | - | Sakshi
Sakshi News home page

నయవంచన.. నమ్మక ద్రోహం

Published Thu, Jan 30 2025 2:17 AM | Last Updated on Thu, Jan 30 2025 2:17 AM

నయవంచన.. నమ్మక ద్రోహం

నయవంచన.. నమ్మక ద్రోహం

దేవరాపల్లి: ప్రజలను నమ్మించి మోసగించడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, నయవంచనలో అతనికి సాటి లేరని మాజీ డిప్యూ టీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేదని సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయలేమని చంద్రబాబు పరోక్షంగా చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ పథకాల ఆశ చూపి, అధికా రంలోకి వచ్చాక నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వంచించారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు సహా పవన్‌, పురందేశ్వరి తదితర కూటమి నేతలు సూప ర్‌ సిక్స్‌ పథకాలను అందిస్తామని చెప్పి నిలువునా మోసగించారని ధ్వజమెత్తారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారని.. మద్యం, మైన్స్‌, ఇసుక, గ్రావెల్‌, మట్టి దోపిడీకి అవకాశం కల్పించి సంపదను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్‌ ప్రయాణం, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 పథకం ఎక్కడని నిలదీశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీకి ఎగనామం పెట్టినట్లేనా అని ప్రశ్నించారు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలండర్ల పథకం కొందరికే వర్తించగా, అందులో కొందరికి నగదు జమ కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్‌ చార్జీల భారం మోపడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. సంక్రాంతికి రోడ్లపై గుంతలన్నీ పూడ్చివేస్తామన్న మాటను నిలబెట్టుకోలేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అధికారం చేపట్టి 8 నెలలు పూర్తయినా ఏ ఒక్కటైనా అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయకుంటే ప్రజల తరపున పోరాటం సాగించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని ముత్యాలనాయుడు హెచ్చరించారు.

ఇదే చంద్రబాబు నైజం

సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఎగనామం పెట్టారు

అమలు చేయకుంటే ప్రజలతో కలిసి పోరాటం

మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement