ట్యాంక్‌బండ్ పనులకు ప్రతిపాదనలు
● అధికారులకు అయ్యన్న ఆదేశం
అధికారులతో కలిసి పెద్ద చెరువు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. బుధవారం తన నివాసంలో ఆర్ అండ్ బీ, పర్యాటక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయనున్న పెద్ద చెరువును పరిశీలించారు. సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఆయా శాఖల హెడ్ ఆఫీసులకు పంపించాలని స్పీకర్ అధికారులకు సూచించారు. పార్కింగ్, టాయిలెట్ల నిర్మాణాలు, విగ్రహాల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ డీఈ విద్యాసాగర్, ఏఈ నారాయణరెడ్డి, టూరిజం శాఖ డీఈ స్వామి, ఈఈ రమణ, ఏఈ సీతారాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment