‘తాండవ’ లీకేజీల నివారణకు చర్యలు
ప్రాజెక్టు పనుల గురించి డీఈ అనురాధతో చర్చిస్తున్న ఇరిగేషన్ ఈఈ బాలసూర్యం
నాతవరం: తాండవ రిజర్వాయర్ ప్రధాన గేట్ల లీకేజీ ద్వారా వృథాగా పోతున్న నీటిని అరికట్టేందుకు చర్యలు చేపడతామని ఇరిగేషన్ ఈఈ వి.బాలసూర్యం చెప్పారు. ఆయన బుధవారం తాండవ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ప్రధాన కాల్వల అక్విడెక్టులు, స్లూయిస్‌లను డీఈ అనురాధతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెండు జిల్లాల పరిధిలో ఉన్న తాండవ కాల్వల అభివృద్ధి కోసం మొదట విడత కింద 18 పనులకు గాను రూ.2 కోట్ల 10 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో తాండవ ప్రధాన గేట్లకు మరమ్మతులు చేస్తామని, ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయన్నారు. అవి కాకుండా తాండవ ప్రధాన కాలువలు, పిల్ల కాల్వలతోపాటు శిఽథిలమైన అక్విడెక్టులు స్లూయిజ్‌లకు మరమ్మతులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తాండవ ప్రాజెక్టు జేఈలు శ్యామ్‌కుమార్, రవికుమార్, ప్రేమ్‌కుమార్, దుర్గాప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు నాగబాబు, అప్పారావు, నీటి సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment