హైకోర్టు ఆదేశాలతో అధికారుల జాయింట్ సర్వే
● పరిహారం కోసం వ్యాజ్యం వేసిన 29 మంది చినకలవలాపల్లి గ్రామస్తులు
చినకలవలాపల్లిలో సర్వే చేస్తున్న వివిధ శాఖల అధికారులు
రాంబిల్లి (యలమంచిలి): రాంబిల్లి మండలం చినకలవలాపల్లి ప్రాంతంలో నేవీ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో హైకోర్టు ఆదేశాలతో బుధవారం రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్‌శాఖ, డీఆర్డీవో అధికారులు జాయింట్ సర్వే చేపట్టారు. ఈ ప్రాంతానికి చెందిన 29 మంది తమకు గతంలో అటవీ, ప్రభుత్వ భూముల్లో అధికారులు ఇచ్చిన డీ పట్టాలకు సంబంధించి పరిహారంతో పాటు ఇతర సమస్యలకు సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నాలుగు శాఖల అధికారులు పిటిషన్‌దారుల సమక్షంలో జాయింట్ సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు అనకాపల్లి ఆర్డీవో ఆయిషా, రెవెన్యూ అధికారులు, అటవీశాఖ అధికారులు, రక్షణశాఖ అధికారులు, పోలీసులు చినకలవలాపల్లి గ్రామంలో పర్యటించి పిటిషన్‌దారులను పిలిచి వారి నుంచి వాంగ్మూలం తీసుకోని భూములు సర్వే చేశారు. పిటిషనర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment