కురుబల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత జగన్‌దే
అనంతపురం కార్పొరేషన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి కురుబల ఆత్మగౌరవాన్ని కాపాడారని మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. సోమవారం భక్త కనకదాస జయంతిని పురస్కరించుకుని నగరంలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పాతూరులోని కనకదాస విగ్రహం వరకు సాగిన ర్యాలీలో మాజీ మంత్రి శంకర్ నారాయణ, వైఎస్సార్ సీపీ నాయకురాలు శివబాల తదితరులు పాల్గొన్నారు. కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జగనన్నకు విజ్ఞప్తి చేయగా.. వెంటనే ప్రత్యేక జీఓ విడుదల చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనకదాస జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కీర్తనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన గొప్ప కవి కనకదాసు అని కొనియాడారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి చొరవ తీసుకుని కనకదాస జయంతిని సెలవు దినంగా ప్రకటించేలా సీఎం చంద్రబాబును ఒప్పించాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకురాలు శివబాల మాట్లాడుతూ కుప్పంలో కనకదాస విగ్రహావిష్కరణలో భాగంగా సీఎం చంద్రబాబు కురుబలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల ఓవరాక్షన్..
కనకదాస విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. గతంలో కనకదాస జయంతి రోజున తాము అన్ని పార్టీల వారిని ఆహ్వానించే వారమని, నేడు ఇలా అడ్డుకోవడం సరికాదని మాజీ మంత్రి శంకర్ నారాయణ పోలీసులకు చురకలంటించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పామిడి వీరాంజినేయులు, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు, చిట్రా వెంకటేష్, పసుపుల ఆది, బుల్లే లింగ ప్రసాద్, నసనకోట ముత్యాలు, పెనుకొండ పర మేష్, ఉజ్జినప్ప, రామాంజినేయులు,సోమందేపల్లి ఎంపీపీ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శంకర్ నారాయణ,
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
భక్త కనకదాసకు ఘన నివాళి
Comments
Please login to add a commentAdd a comment