గ్రామాల్లో పర్యటన
రాప్తాడు రూరల్/బుక్కరాయసముద్రం: అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లితో పాటు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని పి.కొత్తపల్లి గ్రామంలో ఎస్సీ కులాల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం పర్యటించారు. ఎస్సీ రైతులు కాశయ్య, బాబయ్య చీనీ పంటలను పరిశీలించారు. దళిత రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప్పరపల్లిలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం వ్యవస్థను పరిశీలించారు. ఈ క్రాప్, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్‌హెచ్‌ఓ ఆయనకు వివరించారు. చైర్మన్ వెంట కలెక్టర్ వినోద్‌కుమార్,అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, హార్టికల్చర్ డీడీ నరసింహారావు, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, డ్వామా పీడీ సలీమ్‌బాషా తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment