విద్యుత్‌ చార్జీల భారం.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చార్జీల భారం..

Published Tue, Jan 28 2025 12:55 AM | Last Updated on Tue, Jan 28 2025 12:55 AM

విద్య

విద్యుత్‌ చార్జీల భారం..

గార్లదిన్నె మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు తన బోరు బావికి కరెంటు లైన్‌ వేయాలంటూ ఇటీవల ఏఈని సంప్రదించారు. అయితే, లైన్‌ మంజూరు

చేయాలంటే రూ.50 వేలు అందజేయాల్సి ఉంటుందని,

లేదంటే ఎస్టిమేషన్‌ ఎక్కువగా వేస్తామని ఏఈ స్పష్టం చేశారు. దీంతో రైతు మరో దారి లేక ఆమేర డబ్బు

ఇచ్చి లైను లాగించుకున్నారు.

తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు కోసం యాడికి మండలానికి చెందిన ఓ రైతు ఆరు నెలల క్రితం విద్యుత్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. స్టాకు లేదని చెబుతున్నారని రైతు వాపోయారు. వీరే కాదు.. జిల్లాలోని వేల మందిది ఇదే దుస్థితి.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రైతులందరూ మీ పొలాల్లో మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీరు వాడుకోగా మిగిలింది ప్రభుత్వానికి ఇచ్చేలా చేస్తాం. కరెంటు చార్జీలు పెరగవు. రైతులే సంపద సృష్టించేలా తీర్చిదిద్దుతాం’ అంటూ ఎన్నికలముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ఒట్టి మాటగానే మిగిలిపోయింది. కూటమి సర్కారు అలసత్వం కారణంగా ఉమ్మడి అనంత పురం జిల్లాలో మళ్లీ కరెంటు కష్టాలు మొదలయ్యాయి. పంటలు పెట్టుకుందామనే గంపెడాశతో కొత్తగా బోర్లు వేసుకుని విద్యుత్‌ కనెక్షన్‌ కోసం అధికారుల వద్దకు వెళ్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. దీనికితోడు ఏఈలు లంచాలు అడుగుతుండటంతో వారి ఆక్రందన వర్ణనాతీతంగా ఉంటోంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు, వైర్లు లేవని చెబుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 15 వేల వరకూ పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రబీ సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులు... బోర్లకింద అయినా పంటలు వేసుకుని బాగుపడదామనుకుంటే వారి ఆశలపై సర్కారు నీళ్లు చల్లుతోంది. కాగా.. గత ప్రభుత్వంలో కరెంటు కష్టాలు ఉండేవి కాదని, వ్యవసాయ కనెక్షన్లు సులభంగా ఇచ్చేవారని రైతులు చెబుతున్నారు. నూతన ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్‌ అందించారని, ఇప్పుడు పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని అంటున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో కరెంటు కోతలు..

శ్రీ సత్యసాయి జిల్లాలో జనవరి కూడా దాటక ముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. పూర్తిగా బోరుబావుల కిందే పంటలు పండించుకునే రైతన్నలు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. ధర్మవరం, పుట్టపర్తి, మడకశిర ప్రాంతాల్లో విద్యుత్‌ కార్యాలయాల ఎదుట రైతులు ధర్నాకు దిగుతున్న పరిస్థితి.

స్పందించని ఎస్‌ఈ..

కూటమి సర్కారు ఏర్పడగానే ఎస్‌ఈగా సంపత్‌కుమార్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేసి మరీ ఆయన్ను తీసుకొచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా విద్యుత్‌ సమస్యలపై కలవడానికి వెళితే కనీసం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఫోన్‌ చేస్తే కూడా స్పందన లేదని చెబుతున్నారు. మీడియా ప్రతినిధులు ఫోన్‌ చేసినా ఎస్‌ఈ స్పందించకపోవడం గమనార్హం.

వేల సంఖ్యలో కొత్త వ్యవసాయ కనెక్షన్ల పెండింగ్‌

నీళ్లున్నా కరెంటు లేక రైతుల విలవిల

డీపీలు, విద్యుత్‌ లైను వైర్లు లేవని చెబుతున్న అధికారులు

డీపీ మంజూరుకు రూ.50 వేలు అడుగుతున్నారంటున్న అన్నదాతలు

వ్యవసాయాధారిత జిల్లాలో దారుణంగా రైతుల పరిస్థితి

కూటమి సర్కారు వచ్చాక విద్యుత్‌ చార్జీలు భారీగా పెరగడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. అనంతపురం నగరంలోని అశోక్‌ నగర్‌కు చెందిన అల్లాబకష్‌ ఇంటికి నవంబర్‌లో రూ.560 కరెంటు బిల్లు రాగా, డిసెంబర్‌లో ఏకంగా రూ.1,300 వచ్చింది. దీంతో హతాశుడైన అల్లాబకష్‌ ఇదేమని విద్యుత్‌ అధికారులను అడిగితే కరెంటు చార్జీలు పెరగవా.. ఎప్పుడూ అలాగే ఉంటాయా అంటూ అవహేళన చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సతమతమవుతుంటే.. చార్జీల రూపంలో తనలాంటి మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచారని అల్లాబకష్‌ వాపోయారు.

అదిగో ఇదిగో అంటున్నారు

విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసి 10 నెలలు అవుతోంది. ట్రాన్స్‌ఫార్మర్‌ అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందంటున్నారు. మెటీరియల్‌ రాలేదని చెబుతున్నారు. చేసేది లేక పక్క రైతు పొలంలోని కనెక్షన్‌ తీసుకుని వరి పంట సాగు చేశా.

–సత్యనారాయణ, ఇల్లూరు, గార్లదిన్నె మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యుత్‌ చార్జీల భారం..1
1/2

విద్యుత్‌ చార్జీల భారం..

విద్యుత్‌ చార్జీల భారం..2
2/2

విద్యుత్‌ చార్జీల భారం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement