వికసిత అనంత దిశగా కృషి చేయాలి
అనంతపురం: ప్రస్తుత సవాళ్లను అధిగమిస్తూ ‘వికసిత అనంతపురం’ దిశగా లక్ష్యసాధనకు కృషి చేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్ట్‌ల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలసి సంబంధిత జిల్లా అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం , ప్రతి గ్రామ పరిధిలోని ప్రతి గృహానికి సురక్షిత తాగునీరు ఇచ్చే సంకల్పంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ అమలు తీరు, అనంతపురం నగరంలో అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, జిల్లాను ఎలక్ట్రానిక్ వస్తు తయారీ కేంద్రంగా మార్చడానికి రూపొందిచన ప్రణాళికలపై చర్చించారు. ఉపాధి హామీ పథకం హామీలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.201.63 కోట్లతో ఇప్పటి వరకు రూ.117.56 కోట్లు మాత్రమే వ్యయం చేశారని, దాదాపు 85 కోట్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఉన్నందున, ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలులో వేగం పెంచాలన్నారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్‌కుమార్, సీపీఓ అశోక్‌కుమార్, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, డ్వామా పీడీ సలీంబాషా తదితరులు పాల్గొన్నారు.
20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
Comments
Please login to add a commentAdd a comment