న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ముట్టడి
ఉరవకొండ: వృద్ధురాలి మృతికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, న్యాయం చేయాలంటూ బుధవారం ఉరవకొండ పోలీస్ స్టేషన్‌ను బాధిత కుటుంబసభ్యులు ముట్టడించారు. ఘటనతో దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. వివరాలు... ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన సుభద్రమ్మ (77) మంగళవారం ఉదయం రహదారి దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమై టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారంటూ చిన్నముష్టూరు వాసులు బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఉరవకొండ పీఎస్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ఆందోళనకారులతో సీఐ మహనంది, ఎస్‌ఐ జనార్దననాయుడు చర్చించినా ఫలితం లేకపోయింది. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే సహించబోమంటూ హెచ్చరించారు. చివరకు పోలీసులు న్యాయం చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు.
పామిడిలో బయటపడిన శాసనం
పామిడి: పామిడి గ్రామ శివారున కొండ ప్రాంతంలో బుధవారం ఓ శిలాశాసనాన్ని అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సిద్ధగిరి గుర్తించారు. కన్నడ లిపిలో ఉన్న ఈ శాసనం 16 శతాబ్దానికి చెందినదిగా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిందన్నారు. దీనిపై లోతైన అధ్యాయనం చేయనున్నట్లు తెలిపారు.
‘ఎస్సీ, ఎస్టీలకు జనాభా
ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి’
అనంతపురం టవర్‌క్లాక్: ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన రవిశంకర్ డిమాండ్ చేశారు. అనంతపురంలోని ఎన్జీఓ హోంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నారు. జనాబా ప్రాతిపదికన రూ.12 లక్షల కోట్లకు తక్కువ కాకుండా ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లెక్చరర్ సుగప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment