అర్హులకు సబ్సిడీ రుణాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులకు సబ్సిడీ రుణాలు

Published Thu, Jan 30 2025 12:29 AM | Last Updated on Thu, Jan 30 2025 12:29 AM

అర్హులకు సబ్సిడీ రుణాలు

అర్హులకు సబ్సిడీ రుణాలు

అనంతపురం రూరల్‌: ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్రహ్మణ్యం బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వయం ఉపాధి పథకం కింద జనరిక్‌ మెడికల్‌ షాపుల నిర్వహణకు ఆసక్తి ఉన్న బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ కులాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీలోపు https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

యువకుడి ఆత్మహత్య

కళ్యాణదుర్గం రూరల్‌: ఒంటరి జీవితాన్ని తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... కళ్యాణదుర్గంలోని భట్టువాని కాలనీకి రాజేష్‌ (32) తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం మృతిచెందారు. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా జీవించే ఆయన .. మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తన ఇంట్లో మద్యం మత్తులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

అప్పుల బాధతో..

ఉరవకొండ: అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన రామాంజినేయులు (47)కు భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఏడాది కాలంగా అద్దెలు లేక తీవ్ర అర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలో వడ్డీల భారం పెరిగి అప్పులు రూ.3 లక్షలకు చేరుకున్నాయి. ఈ మొత్తాన్ని తీర్చే మార్గం కానరాక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామాంజినేయులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement